Amardeep : ఆ సమయంలో గర్ల్స్ హాస్టల్ పై రాళ్లు.. వేరే అబ్బాయితో నా గర్ల్ ఫ్రెండ్.. అమర్ దీప్ కామెంట్స్ వైరల్!

బుల్లితెర నటుడు అమర్ దీప్( Amardeep ) గురించి మనం దరికి తెలిసిందే.అమర్ ప్రస్తుతం హీరోగా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్గా టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు

సుప్రీత( Supreetha ) నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే మొదట ఈ సినిమాకు బాడ్ బాయ్ అనే పేరుని అనుకున్నప్పటికీ అది సరిగా వర్కౌట్ అవ్వకపోవడంతో వేరే టైటిల్ కోసం వెతుకుతున్నారట.

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమర్దీప్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Amardeep Shocking Comments About His Girlfriend
Advertisement
Amardeep Shocking Comments About His Girlfriend-Amardeep : ఆ సమయంల�

ఈ సందర్భంగా అమర్ దీప్ మాట్లాడుతూ.బెంగుళూరు గర్ల్స్ హాస్టల్ లో( Bengaluru Girls Hostel ) రాళ్లు ఎందుకు విసిరేసావ్ అసలు.అని హోస్ట్ అడిగేసరికి నేను ఇష్టపడిన ఒక అమ్మాయిని చూడకూడని పరిస్థితిలో చూసాను.

ఈ అబ్బాయి వెళ్లి తనను హగ్ చేసుకున్నాడు.అది చూసి నేను చాలా ఫీల్ అయ్యాను.

అప్పుడు నన్ను చూసిన ఆ అమ్మాయి భయపడి వెళ్లి హాస్టల్ లో దాక్కుంది.నేను కోపంతో బయటకు రా మాట్లాడుకుందాం అని పిలిచాను కానీ రాలేదు.

ఫోన్ చేసాను.స్విచాఫ్ చేసింది.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

అప్పుడు నోకియా ఫోన్స్ కదా.టక్కున ఆఫ్ చేసేయొచ్చు.

Amardeep Shocking Comments About His Girlfriend
Advertisement

సెల్ ఆఫ్ చేస్తావా అని సెల్ విసిరేసా అది తీసుకుని లోపలి వెళ్ళిపోయింది.ఎన్ని సార్లు పిలుస్తున్నా రాకపోయేసరికి రాళ్లు విసిరేసాను.ఇవన్నీ పాత కథలబ్బా 2007 - 08 టైం లోవి.

ఇప్పుడున్న కథలో నేను, నా సినిమా, నా ఫామిలీ, నా కుక్క అంతే.అయితే నేను జస్ట్ మిస్( Just Miss ) అని ఒక వెబ్ సిరీస్ చేశా.

అందులో 24 లిప్ లాక్స్ ఉంటాయి.అది అసలు రిలీజ్ కాలేదు ఎప్పుడవుతుందో కూడా తెలీదు.

నాకు నా కో-స్టార్స్ మీద ఎప్పుడూ క్రష్ లేదు.ప్రియాంక గారు కానీ మెరీనా గారు కానీ మంచి ఫ్రెండ్స్.

వాళ్లకు ఆల్రెడీ బాయ్-ఫ్రెండ్స్ ఉన్నారు.అయితే ఇండస్ట్రీలో ఒక పెద్దాయన నాకు చెప్పారు ప్రేమాదోమా లాంటి పత్తి వ్యాపారం పెట్టుకోవద్దని దాంతో నాకు ఇండస్ట్రీలో ఎవరి మీద ఇలాంటి అభిప్రాయలు కానీ క్రష్ లు కానీ అసలు లేవు అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు అమర్ దీప్.

తాజా వార్తలు