మేడమ్ గంగూబాయ్ ఎక్కడ.. భీమ్లా తుఫాన్‌ లో కనిపించదేం?

బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు ప్రతి వారం ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటాయి.కానీ అన్ని సినిమాలు సౌత్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించవు.

కొన్ని సినిమాలు మాత్రమే సౌత్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి.కొన్ని హిందీ సినిమా లు మాత్రమే సౌత్ లో డైరెక్ట్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది.

సౌత్ సినిమాలు నార్త్‌ లో రీమేక్ అయినంతగా నార్త్‌ సినిమాలు సౌత్ రీమేక్ అవ్వడం లేదు.అలాగే హిందీ సినిమాలు ఎక్కువగా తెలుగులో లేదా ఇతర సౌత్ భాషల్లో డబ్బింగ్ అవ్వడం లేదు.

ఈ మధ్య కాలంలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం లో ఆలియా భట్ హీరోయిన్ గా నటించిన గంగూబాయ్‌ సినిమా మాత్రం ఎక్కువగా సౌత్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.ఆలియా భట్ నటించిన ఈ బయోపిక్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

తెలుగులో కూడా ఈ సినిమా ను డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

ప్రమోషన్ కార్యక్రమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగాయి.ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ఆలియా భట్ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ లభించింది.దాంతో ఆలియా భట్ నటించిన గంగుబాయి సినిమాకు ఈ కచ్చితంగా ఇక్కడ మంచి క్రేజ్ లభిస్తుందని దాంతో మంచి వసూళ్లు దక్కుతాయని అంతా భావించారు.

నిజంగానే గంగుబాయి సినిమాకు మంచి ఓపెనింగ్స్ అయితే లభించేవి.సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వసూళ్లు బాగానే వచ్చేవి.కానీ నేడే విడుదలైన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వల్ల మొత్తం అంచనాలు తల కిందులయ్యాయి.

గంగుబాయి సినిమాను కనీసం పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.అసలు గంగుబాయి సినిమా విడుదల అవుతుంది అనే విషయాన్ని కూడా తెలుగు ప్రేక్షకులు మర్చిపోయారు.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

చాలా ఏరియాల్లో కనీసం థియేటర్లకు కూడా తీసుకోలేదు.తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే ఉత్తరాదిన కూడా ఏమంత బాగాలేదు.

Advertisement

అక్కడ విడుదలైన మొదటి ఆటతోనే ఫ్లాప్ టాక్ వచ్చింది.ఆలియా భట్ కోసం తప్పితే ఆ సినిమా చూడాల్సిన అవసరమే లేదు అంటూ ఆమె ఫ్యాన్స్ తేల్చేశారు.

దాంతో కలెక్షన్స్ ఎలా వస్తాయి అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.లేడీ ఓరియంటెడ్ మూవీ అయినా కూడా రెండు వందల యాభై కోట్లకి పైగా ఈ సినిమా దక్కించుకుంటుంది అంటూ సంజయ్ లీలా బన్సాలీ అండ్ టీం నమ్మకంగా ఉన్నారు.

కాని అంత సీన్‌ లేదేమో అనిపిస్తుందని టాక్‌ వినిపిస్తుంది.

" autoplay>

తాజా వార్తలు