మద్యం ఆరోగ్యానికి హానికరమే.. కానీ రెడ్ వైన్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

మద్యపానం అనగానే ఎన్నో రకాలు ఉంటాయి.మరెన్నో బ్రాండ్ల విషయం పక్కన పెడితే ఎన్నో రకాల ఆల్కహాలిక్ పానీయాలు( Alcoholic ) అందుబాటులో ఉన్నాయి.

బ్రాందీ, విస్కీ, స్కాచ్, బీర్, వైట్ వైన్, రెడ్ వైన్ ఇలా చాలానే ఉన్నాయి.అన్నిట్లో రెడ్ వైన్ కాస్త భిన్నమైనదిగా చెబుతూ ఉంటారు.

ఎందుకో ఏమిటో, ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా ఆల్కహాల్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు అని దాదాపు చాలామందికి తెలుసు.

ఇది ఒక సామాజిక రుగ్మత మాత్రమే కాదు.ఆరోగ్యానికి కూడా ఎంతో హాని చేస్తుంది.

Advertisement

అందుకే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే బోడ్లు పెద్ద పెద్ద అక్షరాలతో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి.

అయితే రెడ్ వైన్ ( Red wine )అలా కాదని నిపుణులు చెబుతున్నారు.ఇది పులియబెట్టిన ద్రాక్షతో తయారు చేసిన పానీయం.ప్రతి రోజు మితంగా రెడ్ వైన్ తాగితే జీవితకాలం పెంపు, గుండెకు ఆరోగ్యనికి మంచిదని చెబుతున్నారు.

అదే సమయంలో పరిమితి దాటితే మాత్రం అనర్ధాలు కలుగుతాయి.ప్రతిరోజు రెడ్ వైన్ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ ( Blood pressure )నియంత్రణలో ఉంటుంది.ఇందులో ఉండే సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

రోజు రెడ్ వైన్ తాగడం వల్ల డిప్రెషన్ సైతం తగ్గుతుంది.ఇది చాలా అధ్యయనాలలో తెలిసిన విషయమే.

Advertisement

అంతేకాకుండా ప్రతిరోజు తగిన పరిమాణంలో రెడ్ వైన్ తీసుకునే అలవాటు ఉంటే ఆ వ్యక్తుల జీవిత కాలం పెరిగినట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు, సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పించేలా రోగ నిరోధక వ్యవస్థ ( Immune system )మేరుగుపడుతుంది.రెడ్ వైన్ రోజుకు తగిన పరిమాణంలో అంటే 200 నుంచి 250 మిల్లీలీటర్లు తాగే అలవాటు ఉంటే ఆ వ్యక్తుల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయి గణనీయంగా తగ్గినట్లు చాలా అధ్యయనాలలో నిపుణులు కనుగొన్నారు.

అయితే ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి హానిచేస్తుంది.ఎప్పుడైతే రెడ్ వైన్ కొలెస్ట్రాల్ తగ్గించగలుగుతుందో, సహజంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

తాజా వార్తలు