ఆరాధ్య బచ్చన్‌ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు?

ఒకప్పటి సినీ ప్రేక్షకులకు ఐశ్వర్యరాయ్ అంటే ఒక అందాల దేవత, ఆమెని దేవత అన్నట్లుగా పూజించేవారు.

ప్రతి యువకుడి గుండెల్లో మాత్రమే కాకుండా, ప్రతి ఇంట్లోని గోడ పై కూడా ఆమె రూపం ఉండేది.

అలాంటి ఐశ్వర్య రాయ్ ఇప్పటికి కూడా లక్షల్లో అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు.ఆమెకున్న అభిమానులు చిర స్థాయిగా నిలిచి పోతారు.

ఆమె అందాన్ని ఆమె కళ్ళని ప్రేమించే వారు ఎల్లకాలం ఉంటారు. ఈ వయసులో కూడా ఆమె ను ఎంతో మంది అభిమానిస్తున్నారంటే ఆమె అందం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

ఆమె వారసత్వంగా ఆరాధ్య బచ్చన్ హిందీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.

Advertisement

ఇటీవల అంబానీ వారి ఇంట జరిగిన వివాహా నిచ్చితార్థ వేడుకలో ఆరాధ్య బచ్చన్ తో కలిసి ఐశ్వర్య రాయ్‌ పాల్గొన్నారు.ఆరాధ్య ను చూసి జనాలు ఆశ్చర్యం చేశారు.సోషల్ మీడియా లో ఆరాధ్య బచ్చన్‌ యొక్క ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఐశ్వర్య రాయ్ హైట్ కి సమానంగా ఆరాధ్య హైట్ ఉంది, అంతే కాకుండా అందం విషయం లో తల్లికి ఏ మాత్రం తగ్గకుండా ఉందంటూ ప్రశంసలు దక్కించుకుంది.ఒకటి రెండు సంవత్సరాల్లో ఆరాధ్య బచ్చన్ బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ చర్చ మొదలైంది.

ప్రస్తుతానికి చదువుకుంటున్న ఆరాధ్య రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో సినిమాలతో కూడా బిజీ అయ్యే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.తల్లి వారసత్వం తో.తాత వారసత్వం తో ఆరాధ్య బచ్చన్ బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలగాలని ఐశ్వర్య రాయ్‌ మరియు బచ్చన్ ఫ్యామిలీ అభిమానులు కోరుకుంటున్నారు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు