'డుగ్గు డుగ్గు బుల్లెట్' అంటూ హల్చల్ చేస్తోన్న వెన్నెల జయతి (వీడియో)

ఇదివరకు కాలంలో జెమినీ మ్యూజిక్ ఛానల్ లో వెన్నెల( Vennela ) అనే ప్రోగ్రాం ద్వారా వీడియో జాకీగా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన జయతి( Jayathi ) చాలామందికి ఇంకా గుర్తు ఉండే ఉంటుంది.

ప్రస్తుత యువతకు జయతి గురించి పెద్దగా తెలియకపోయినా, ఇదివరకు యువతకు మాత్రం ఆవిడ అంటే ఒక రకమైన క్రేజ్ కూడా ఉండేది.

వీడియో జాకీగా అలరించిన జయతి కి అప్పట్లో కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది.అప్పట్లో తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఆమెను ఆంధ్ర మాధురి దీక్షిత్ లా ఉందంటూ అభిమానులు ప్రశంసలు కురిపించేవారు.

ఇదే క్రేజ్ తో ఆమె దినదినాభివృద్ధిలో భాగంగా వీడియో జాకీగా పనిచేసిన తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదండోయ్.నిర్మాతగా కూడా వ్యవహరించింది.తానే నిర్మాతగా వ్యవహరించి అదే సినిమాలో హీరోయిన్గా నటించి మెప్పించింది.

Advertisement

తన సొంత నిర్మాణ సంస్థలో ఏకంగా హర్రర్ కామెడీ మూవీ జానర్ లో లచ్చి అనే ఓ సినిమాను నిర్మించి హీరోయిన్గా నటించింది.అయితే, ఆ సినిమా పెద్దగా ప్రజలకు చేరలేదని చెప్పవచ్చు.

ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని ఆవిడ మరోసారి ప్రేక్షకుల ముందుకు అలరించడానికి వచ్చింది.అయితే, ఈసారి ఆవిడ సినిమాతో కాకుండా ఓ ఆల్బమ్ సాంగ్ చేస్తూ నటనకు స్కోప్ ఉండే విధంగా నటించింది.

తాజాగా డుగ్గు డుగ్గు బుల్లెట్( Duggu Duggu Bulleto ) బండి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టును అందుకుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.నివృతి వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో రెండు మిలియన్స్ కు పైగా వ్యూస్ దక్కించుకోవడమే కాకుండా వేల సంఖ్యలో లైక్స్ ని కూడా పొందింది.పెళ్లి నేపథ్యంలో కొనసాగే ఈ ఫోక్ సాంగ్ లో యాక్టర్ జయతి తనదైన శైలిలో డాన్స్ చేస్తూ నటించి మెప్పించింది.

బన్నీ నువ్వు నా బంగారం.. వివాదంపై స్పందించిన రాజేంద్రప్రసాద్!
బన్నీ నువ్వు నా బంగారం.. వివాదంపై స్పందించిన రాజేంద్రప్రసాద్!

ఇక ఈ ఆల్బమ్ పాటలో జయంతి సరసన ఆశిష్ లీడ్ రోల్ లో నటించారు.

Advertisement

తాజా వార్తలు