Actress Eeswari Rao: నన్ను చూసి ఈ నల్ల పిల్ల బాగుంది అనేవారు.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన ఈశ్వరి రావు ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

అప్పటికీ ఇప్పటికీ నేను యాక్టివ్ గా ఉండవచ్చని అయితే వయస్సు మాత్రం ఉండదు కదా అని ఆమె అన్నారు.

దర్శకులు ఎలా చెబితే అలా చేయడం తప్ప సొంతంగా హోం వర్క్ చేయడం తెలిదయని ఈశ్వరి రావు తెలిపారు.నేను దర్శకులు మలచిన బొమ్మ అని ఈశ్వరి రావు కామెంట్లు చేశారు.

మా ఫ్యామిలీలో యాక్టింగ్ ఎవరికీ తెలియదని ఆమె అన్నారు.నేను వెళ్లడమే తమిళంకు వెళ్లానని ఈశ్వరి రావు తెలిపారు.

రాధగారు మా నెక్స్ట్ బ్యాచ్ అని ఈశ్వరిరావు పేర్కొన్నారు.నాకు ఇద్దరు అమ్మలు అని ఆ అమ్మలు ప్రభావతి అమ్మాజీ అని ఆమె వెల్లడించారు.

Advertisement

ఒకరు కన్నతల్లి అయితే మరొకరు పెంచిన తల్లి అని ఆమె అన్నారు.ఒక సినిమాలో నన్ను చూసి ఈ నల్ల పిల్ల ఎవరో బాగా చేసింది అని అన్నారని ఆమె పేర్కొన్నారు.

ఆ తర్వాత మణిరత్నం గారు పిలిచి ఆయన సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చారని ఈశ్వరిరావు వెల్లడించారు.బాపుగారి దగ్గరకు వెళితే ఇన్స్టిట్యూట్ కు వెళ్లి రావడమేనని ఆమె అన్నారు.

న్యాచురల్ గా నటించాలని ఆయన కోరేవారని ఈశ్వరి రావు వెల్లడించారు.టీవీ సీరియళ్లలో నేను నటించానని ఆమె పేర్కొన్నారు.రాధికతో సమానంగా నాకు పే చేశారని ఈశ్వరిరావు వెల్లడించారు.

బ్రహ్మోత్సవం సినిమాలో నటించినా గుర్తింపు దక్కలేదని ఆమె అన్నారు.కొన్ని సినిమాలు వద్దని రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయని ఈశ్వరిరావు పేర్కొన్నారు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఎక్కువ పేమెంట్ అడిగి సినిమాలను వదులుకున్న సందర్భాలు ఉన్నాయని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.ఈశ్వరి రావు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు