జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన నటుడు?

ఈ మధ్యకాలంలో ఎక్కువమంది సెలబ్రిటీలు జిమ్ చేస్తూ అధిక ఒత్తిడికి గురవడం వల్ల గుండెపోటు రావడంతో ఆకస్మికంగా మృతి చెందడం జరుగుతుంది ఇప్పటికే ఎంతోమంది నటులు ఇలా జిమ్ చేస్తూ మరణించిన విషయం మనకు తెలిసిందే.

తాజాగా మరొక బాలీవుడ్ నటుడు జిమ్ చేస్తూ తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు.

ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ రాజు శ్రీ వాస్తవ బుధవారం ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఈయనను హుటాహుటిన ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.నేడు ఉదయం ఆయన త్రెడ్ మిల్క్ పై పరుగులు తీస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యారని అయితే ఇది గమనించిన ఆయన అనుచరులు వెంటనే తనని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఎయిమ్స్ ఆస్పత్రిలో ఐసీయూలో ఈయనకు చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని మరి రెండు రోజులపాటు ఈయన అబ్జర్వేషన్ లో ఉండాలని వైద్య నిపుణులు తెలియజేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈయన ఆరోగ్య విషయం గురించి వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ విడుదల చేస్తున్నారు.

Actor Who Suffered A Heart Attack While Doing Gym , Aiims Hospital ,srivastava ,
Advertisement
Actor Who Suffered A Heart Attack While Doing Gym , AIIMS Hospital ,Srivastava ,

ఇకపోతే ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ కమెడియన్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.దేశంలోని అత్యంత ఫేమస్ స్టాండ్ అప్ కమెడియన్లలో శ్రీవాస్తవ ఒకరు.ఇకపోతే ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రముఖ రాజకీయ నాయకులు కమెడియన్లను ఇమిటేట్ చేయడంలో ఈయనకు ఎవరు సాటి లేరని చెప్పాలి.

ఇక ఈయన నటించిన సినిమాల విషయానికి వస్తే.మైనే ప్యార్ కియా, బాజీగర్, బాంబే టు గోవా, ఆమ్దాని అత్తన్ని ఖర్చు రూపయ్య వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

Advertisement

తాజా వార్తలు