హయత్ నగర్ అత్యాచారం కేసులో నిందితులు అరెస్ట్

హైదరాబాద్ హయత్ నగర్ లో టెన్త్ క్లాస్ విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.నిందితులంతా ఒకే కాలనీకి చెందిన మైనర్లుగా పోలీసులు గుర్తించారు.వీరిపై అత్యాచారం, పోక్సో యాక్ట్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఒకే తరగతి కావడంతో యువకులతో విద్యార్థిని సన్నిహితంగా ఉంది.అదే అదునుగా భావించిన విద్యార్థులు అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

సెల్ ఫోన్లలో అశ్లీల దృశ్యాలు చూసి దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు.

ఆ విషయంలో ఫహాధ్ ఫాజిల్,రాజ్ కుమార్ రావ్ ఫాలో అవుతున్న రాగ్ మయూర్?

తాజా వార్తలు