స్కాలర్ షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ పై ఏబీవీపీ ధర్నా

సూర్యాపేట జిల్లా:అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు కోదాడ నగర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా ఏబీవీపి నల్గొండ విభాగ కన్వినర్ మణికంఠ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపు 8 సంవత్సరాలు పూర్తి కావస్తున్న కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్యార్థులకు వ్యతిరేకంగా ఉంటూ పూర్తిగా అన్యాయం చేస్తుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు స్కాలర్ షిప్ ఫీజ్ రియంబర్స్ మెంట్ మీద ఆధారపడి చదువుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్ షిప్ ఫీజు రియంబర్స్ మెంట్ సకాలంలో అందించని కారణంగా అనేక మంది విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నారు.ఏదైతే పెండింగ్లో ఉన్న 2200 కోట్ల స్కాలర్ షిప్ ఫీజ్ రియంబర్స్ మెంట్ ని వెంటనే భర్తీ చేయాలి అదే విధంగా సంక్షేమ హాస్టల్ లలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులు అందరకి కూడా మెరుగైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ కళాశాలలో జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి అదేవిధంగా పెంచిన బస్ ఛార్జ్ లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కన్వీనర్ కీర్తి శివకుమార్,ఏడుకొండలు వెంకటేశ్వర్లు,అబ్దుల్ రహమాన్, వేణు,వినోద్ కుమార్,కార్తీక్,వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
Advertisement

Latest Suryapet News