చుట్టాలబ్బాయి మూవీ రివ్యూ

చిత్రం : చుట్టాలబ్బాయి బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంటర్‌టైన్‌మెంట్స్ దర్శకత్వం : వీరభద్రమ్ నిర్మాత : రామ్ తల్లూరి సంగీతం : థమన్ విడుదల తేది : ఆగష్టు 19, 2016 నటీనటులు : ఆది, నమితా ప్రమోద్, సాయికుమార్ తదితరులు యువహీరోలంతా కొత్తదనంతో ముందుకు సాగుతోంటే, కెరీర్ మొదటినుంచి మాస్ మంత్రం జపిస్తూ చేతులు కాల్చుకుంటూనే ఉన్నాడు ఆది.

మరోవైపు భాయ్ లాంటి దారుణమైన పరాజయం నుంచి ఇంకా కోలుకోలేదు దర్శకుడు వీరభద్రమ్.

ఇద్దరికీ హిట్ అత్యవసరం.మరి వీరి అవసరం "చుట్టాలబ్బాయి" తీర్చాడా లేదా చూద్దాం.

కథలోకి వెళ్తే .రికవర్ బాబ్జి (ఆది) ఒక రికవర్ ఏజెంట్.తనకి హైదరాబాద్‌లో పరిచయమైన కావ్య (నమిత ప్రమోద్) ఒక సమస్యలో చిక్కుకుంటే సహాయం చేస్తూ దొర (సాయికుమార్) చేతికి చిక్కుతాడు.

పోలీసులతో పాటు మరో గ్యాంగ్ వెతుకుతున్న బాబ్జీ - కావ్యలను దొర ఎందుకు పట్టుకెళ్ళాడు? దొరకి బాబ్జీకి సంబంధం ఏంటి ? అసలు కావ్య ఎందుకు చిక్కుల్లో పడింది? ప్రేయసి రక్షించుకోని బాబ్జి తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా అనేది మిగితా కథ.నటీనటుల నటన గురించి ఆది నటనలో మార్పు లేదు.అదే పాతచింతకాయ పచ్చడి లాంటి సినిమాకి మళ్ళీ అదే పాతచింతకాయ పచ్చడి నటన.డ్యాన్సులు, ఫైట్ల మీద ఒకప్పుడు పూర్తిగా ఆధారపడ్డ స్టార్ హీరోలు సైతం ఇప్పుడు కథాబలం ఉన్న చిత్రాల మీద దృష్టిపెడుతున్నారు.అలాంటిది ఆది లాంటి యువహీరో ఇంకా నటుడిగా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేయకపోవడం శోచనీయం.

Advertisement

హీరోయిన్ నమితా ప్రమోద్ గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమి లేదు.అమ్మాయికి డైలాగులు చెప్పడం కూడా రాలేదు.

సాయికుమార్ కాని, 30 ఇయర్స్ పృథ్వీ కాని కొత్తగా చేయటానికి ఏమి లేదు.పోసాని ఒకే.అభిమన్యు సింగ్ గురించి చెప్పడానికి ఏమి లేదు.సాంకేతికవర్గం పనితీరు థమన్ సంగీతంలో ఒకటి రెండు పాటలు బాగున్నాయి అంతే.

నేపథ్య సంగీతం ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి.కెమేరా పనితనం ఫర్వాలేదు.

ఎడిటింగ్ అస్సలు బాగాలేదు.స్టంట్స్ నవ్వుకునేలా ఉన్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
1000 కోట్లతో చరిత్ర సృష్టించిన పుష్పరాజ్.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమానే!

నిర్మాణ విలువలు బాగున్నాయి.ఇక దర్శకుడు వీరభద్రమ్ ఈ సినిమా ఇలా రావడాని ప్రధాన కారకుడు.

Advertisement

కథావస్తువుని ఎంచుకునేటప్పుడు ఒకటికి ఎన్నిసార్లు ఆయన అలోచిస్తారో అనేది అర్థం కావడం లేదు.భాయ్ లాంటి కళాఖండం తరువాత అన్నేసి విమర్శలు విన్నా, ఏమాత్రం మార్పు లేదు ఆయనలో.

టేకింగ్ చాలా దారుణంగా ఉంది.విశ్లేషణ సినిమాలో ఆత్మ లేదు.

చాలా సినిమాల్లో ఉండట్లేదు.కొత్తదనం అస్సలు లేదు.

తెలుగు సినిమాల్లో అలాంటి విషయాలు మాట్లాడుకోకపోవడమే మంచిది.ప్రేక్షకుడికి నచ్చని సినిమా తీయకపోయినా, కనీసం ప్రేక్షకుడిని కూర్చోబెట్టే సినిమా అయినా తీయాలి.

అంతేకాని, ప్రేక్షకుడిని విసిగించే సినిమా మాత్రం తీయకూడదు.చుట్టాలబ్బాయి ప్రేక్షకులని విసిగించే సినిమా.

ఫస్టాఫ్ అయినా ఓ మోస్తారుగా ఉంటుంది కాని సెకండాఫ్ ని భరించడానికి చాలా ఓపిక కావాలి.అర్ధంపర్థం లేని సన్నివేశాల కూడిక, ఇరికించిన సన్నివేశాలు, పండని ఎమోషన్స్ .వీటి కలయిక చుట్టాలబ్బాయి.హైలైట్స్ : * ఏమి లేవు డ్రాబ్యాక్స్ : * దర్శకుడు, టేకింగ్ * కథ, స్క్రీన్ ప్లే * ఎడిటింగ్ * పాటలు, మాటలు చివరగా : 2016 - ఒక బ్రహ్మోత్సవం, ఒక తిక్క, ఒక చుట్టాలబ్బాయి

తెలుగుస్టాప్ రేటింగ్ : 1.5/5

.

తాజా వార్తలు