తెల్ల జుట్టుకు చెక్ పెట్టే సూపర్ ఎఫెక్టివ్ రెమెడీ మీ కోసం!

ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు( White Hair ) సమస్యను ఫేస్ చేస్తున్నారు.

తక్కువ వయసులోనే జుట్టు తెల్లగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి.

ప్రధానంగా ఒత్తిడి, కాలుష్యం, రసాయనాలతో కూడిన కేశ ఉత్పత్తులను వాడటం వంటి అంశాలు జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.అలాగే కొందరికి జీన్స్ పరంగా కూడా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంటుంది.

అయితే తలలో తెల్ల వెంట్రుకలు కనపడగానే వర్రీ అయిపోతుంటారు.కానీ టెన్షన్ పక్కనపెట్టి కొన్ని ఇంటి చుట్కాలను పాటిస్తే ఆదిలోనే సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ వైట్ హెయిర్ సమస్యను దూరం చేయడానికి సూపర్ ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు మందారం పువ్వులు,( Hibiscus Flowers ) మూడు మందారం ఆకులు, అర కప్పు ఫ్రెష్ కలబంద జెల్( Aloevera Gel ) మరియు నాలుగు టేబుల్ స్పూన్లు బియ్యం నానబెట్టిన వాటర్( Rice Water ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.ఆపై తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం అలవాటు చేసుకుంటే మస్తు బెనిఫిట్స్ లభిస్తాయి.ముఖ్యంగా ఈ ప్యాక్ వైట్ హెయిర్ కు చెక్ పెడుతుంది.

జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.తెల్ల జుట్టును మళ్లీ నల్లగా మారుస్తుంది.

అలాగే ఈ ప్యాక్ ను వేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.చుండ్రు పోతుంది.

టాలీవుడ్ బ్యానర్ల స్థాయిని పెంచుతున్న దర్శకులు వీళ్లే.. ఈ నిర్మాతలు నిజంగా లక్కీ!
చైతన్య శోభిత పెళ్లికార్డును మీరు చూశారా.. ఈ వెడ్డింగ్ కార్డులో ప్రత్యేకతలు ఇవే!

కురులు దృఢంగా ఆరోగ్యంగా సైతం మారతాయి.

Advertisement

తాజా వార్తలు