వైరల్ వీడియో: అదిరిపోయే సౌండ్ కోసం ఇండిగోలో ప్రయాణించండంటున్న ప్రయాణికుడు..

మ్యూజిక్( Music ) అంటే చాలామందికి ఇష్టం.కొందరికి అయితే ప్రాణం.

ఇక ఈ మ్యూజిక్ కోసం ఉపయోగించే సాధనాలలో గిటార్ ( guitar )కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

గిటార్ నుండి అద్భుతమైన సౌండ్ విన్న అనుభవాన్ని మనం ఆస్వాదించాలంటే ఇండిగో ప్రయాణం చేయాలంటూ తాజాగా పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇక ఈ వైరల్ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఏ ప్రముఖ విమాన సంస్థ( airline ) అయినా సరే ప్రయాణికుల లగేజీని డ్యామేజ్ చేస్తున్నాయని ఇదివరకు చాలామంది ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్న విషయం మనం మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం.ఇందుకు సంబంధించి అనేక వీడియోలు కూడా మనం చూసే ఉంటాము.కాకపోతే ఈసారి ఓ మ్యూజీసియన్ కాస్త వ్యంగంగా ఎయిర్లైన్స్ పై సెటైర్ వేశాడు.

Advertisement

అది కూడా ఓ వీడియోని రిలీజ్ చేసి.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.

పియూష్ కపూర్( Piyush Kapoor ) అనే ఓ మ్యూజిసియన్ ఇటీవల ఇండిగో ఎయిర్లైన్స్ లో( Indigo Airlines ) ప్రయాణం చేయగా అనంతరం ఆయన ఇండిగో సిబ్బంది ద్వారా తనకు జరిగిన అనుభవాన్ని వీడియో తీసి పోస్ట్ చేశాడు.ఈ వీడియోలో తన దగ్గర ఉన్న గిటార్ను వాయిస్తూ ఇంతకు ముందులా కాకుండా మ్యూజిక్ లో కొత్త రకం అనుభవాన్ని తాను చూస్తున్నానని దీనికి మెజీషియన్లు చాలా కష్టపడి పోతుంటారు అంటూ కాస్త వ్యంగంగా చమత్కరించాడు.

ఇందుకోసం ఏ విమాన సర్వీస్ అయిన మనం ప్రయాణం చేస్తే చాలు అంటూ తన పాడైపోయిన గిటార్ను చూపిస్తూ చమత్కారంగా మాట్లాడతాడు.ఎంతో ప్రేమగా చూసుకునే తన గిటార్ ను ఇలా ఎయిర్ లైన్స్ విచ్చిన్నం చేస్తుందని దాంతో ఆ మ్యూజిక్ ఎఫెక్ట్ ను ఉచితంగా పొందుతున్నానని ఆయన తెలిపాడు.అంతేకాకుండా ఇలాంటి అద్భుతమైన ఆవిష్కరణకు రూపు దాల్చిన ఇండిగో సిబ్బందికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని అందుకుగాను ఎయిర్పోర్టులో కూడా ఓ కృతజ్ఞతా పత్రాన్ని సమర్పించానని క్యాప్షన్ గా జత చేశాడు.

ఈ నేపథ్యంలో ఆయన బ్యాగేజీ హ్యాండర్లకు కాస్త సున్నితమైన వస్తువుల గురించి తెలియజేయాలంటూ ఎయిర్ లైన్స్ కు విజ్ఞప్తి చేస్తూ పోస్టును చేశాడు.దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వైరల్: కోతులు కొట్లాటకు ఆగిపోయిన రైళ్లు!

ఈ వీడియోని చూసిన నెటిజన్స్ వారికి జరిగిన సంఘటనలను కూడా కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు