ఏప్రిల్ 19న జరుపుకునే కామాద ఏకాదశి ప్రాముఖ్యత ఇదే..!

ముఖ్యంగా చెప్పాలంటే కామద ఏకాదశి హిందువులకు ఎంతో పవిత్రమైన ఉపవాస దినం.ఇది మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది.

 This Is The Significance Of Kamada Ekadashi Celebrated On April 19 , Kamada Ek-TeluguStop.com

హిందూ క్యాలెండర్ ప్రకారం కామద ఏకాదశి( Kamada Ekadashi ) శుక్లపక్షంలోని ఏకాదశి రోజు జరుపుకుంటారు.అంటే చంద్రుని వృద్ధి దశ 11వ రోజు చైత్రమాసంలో జరుపుకుంటారు.

ఇది హిందువులకు ఎంతో ముఖ్యమైన రోజు.ఎందుకంటే ఇది హిందూ నూతన సంవత్సరం తర్వాత వచ్చే మొదటి ఏకాదశి.

చైత్ర నవరాత్రి ఉత్సవాల తర్వాత వచ్చే కామద ఏకాదశిని సాధారణంగా చైత్ర శుక్ల ఏకాదశి అని అంటారు.ఈ సంవత్సరం ఏప్రిల్ ఏప్రిల్ 19వ తేదీన కామద ఏకాదశి వచ్చింది.కామద ఏకాదశి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కామద అనే పదం కోరికల నెరవేర్పు నుంచి సూచిస్తుంది.కామద ఏకాదశి అనేది అన్ని ప్రాపంచిక కోరికలను నెరవేర్చే ఆధ్యాత్మిక ఆచారం అని ప్రజలు నమ్ముతారు.కామద ఏకాదశి యొక్క ప్రాముఖ్యత అనేక హిందూ గ్రంధాలలో,అలాగే వరాహ పురాణం( Varaha Purana ) వంటి పురాణాలలో కూడా ఉంది.

ఇంకా చెప్పాలంటే మహాభారత సమయంలో శ్రీకృష్ణుడు( Sri Krishna ) రాజు యుధిష్ఠిరునికి కామద ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపాడు.కామద ఏకాదశి వ్రతం వారి పుణ్యాలను తిరిగి పొందడానికి మెరుగుపరచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని భక్తులు నమ్ముతారు.అంతే కాకుండా భక్తులను వారి కుటుంబాలను అన్ని శాపాల నుంచి కాపాడుతుంది.ఈ రోజు భక్తులు ఉపవాసం ఉంటే అన్ని పాపాలు క్షమించబడతాయి.వివాహితులు కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.ఈ వ్రతం భక్తులకు మోక్షాన్ని పొందేందుకు మరియు శ్రీకృష్ణుని నివాసమైన వైకుంఠధామానికి చేరుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube