సాధారణంగా ప్రతి ఒక్కరూ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.జీవితంలో ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో ఉండాలని ఎప్పుడూ కోరుకుంటుంటారు.
అందుకోసం ఎన్నో పూజలు, పరిహారాలు పాటిస్తూ ఉంటారు.కానీ అవేవీ లేకుండా మీ జేబులో, అలాగే హ్యాండ్ బ్యాగ్ లో మన ఇంట్లో దొరికే కొన్ని వస్తువులను పెట్టుకుంటే చాలు అదృష్టం తప్పకుండా వస్తుంది.
ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే సొంపు, లవంగం ఈ రెండు మసాలా దినుసులు ప్రతికూల శక్తులను బయటకు పంపించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
కొన్ని తరాల నుంచి చాలామంది ప్రజలు వీటిని నమ్ముతూ వస్తూన్నారు.తలుపులకు లేదంటే ఇంటి ప్రధాన ద్వారం ఉండే గుమ్మానికి, సొంపు లేదంటే లవంగాన్ని చిన్న మూట కట్టి పెడుతూ ఉంటారు.దీనివల్ల ఆత్మలు, దయ్యాలు ఇంటికి దూరంగా ఉంటాయని పెద్దవారు నమ్ముతారు.సొంపును తల దిండు కింద పెట్టుకుంటే మంచి నిద్ర పడుతుందని, మన పర్సులో లవంగం ఉండడం వల్ల ప్రతికూల పరిస్థితులకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సొంపు, లవంగం తీసుకోవడం వల్ల సంతానోత్పత్తితో పాటు జ్ఞాపకశక్తి, ధైర్యం, బలం రెండు పెరుగుతాయి. లక్ష్మీదేవి( Lakshmi Devi )కి ఎర్ర గులాబీలతో పాటు లవంగాలు కలిపి పూజ చేయడం వల్ల అదృష్టం, డబ్బు రెండూ కలిసి వస్తాయని నమ్ముతారు.
అలాగే గరం మసాలా వల్ల వంట రుచిగా ఉంటుందనే విషయం దాదాపు చాలా మందికి తెలుసు.వాస్తు శాస్త్రం( Vastu Shastra ) ప్రకారం ఇది విజయాన్ని ఆకర్షించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ మసాలా ప్యాకెట్ మన జేబులో ఉండడం వల్ల అదృష్టం డబ్బు తీసుకొస్తుందని పెద్దవారు నమ్ముతారు.లేదంటే గరం మసాలా పొడిని ఇంట్లో, షాపులో, కార్యాలయాలలో చల్లుకోవచ్చు.
దాల్చిన చెక్క( Cinnamon ) మన ఆదాయంలో పొదుపు పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.దీన్ని జేబులో ఉంచుకోవడం వల్ల ప్రేమ, విజయంతో పాటు సరైన ఆరోగ్యం కూడా లభిస్తుంది.
ఇది సంపదను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
DEVOTIONAL