Medaram Maha Jatara: ఈ రోజు ప్రారంభం కానున్న మేడారం మహా జాతర.. మొదటి రోజు ఎలా జరుగుతుందంటే..?

ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన జాతర మేడారం జాతర అని స్థానిక ప్రజలు చెబుతున్నారు.ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ ఇదే.

 How Will The First Day Of The Medaram Maha Jatara Which Will Begin Today-TeluguStop.com

మొత్తంగా చెప్పాలంటే తెలంగాణ కుంభమేళా( Telangana Kumbh Mela ) ఇదే.అలాగే గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ఆ పండుగే సమ్మక్క సారలమ్మ జాతర( Sammakka Saralamma Jatara ).ఇంకా చెప్పాలంటే మేడారంలో జరిగే ఈ మహా జాతర ఫిబ్రవరి 20వ తేదీన అంటే ఈ రోజు మొదలైంది.ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలో మీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో జరిగే ఈ కుంభ మేళాకు భక్తజనం తరలి వచ్చారు.

ఇప్పటికే సమ్మక్క సారలమ్మ దీక్ష తీసుకున్న భక్తులు మేడారానికి చేరుకున్నారు.ఈ ప్రాంగణమంతా భక్త కోలాహలం నెలకొంది.అటు పెళ్లి కొడుకు పగిడిద్దరాజును సమీప బర్ల గుట్ట పై నుంచి సోమవారం ఉదయం దేవాలయానికి తరలించారు.ముఖ్యంగా చెప్పాలంటే పగిడిద్ద రాజు ఆభరణాలను శుద్ధి చేసి పూజలు చేశారు.

అక్కడి నుంచి తొట్టి వాగు వద్ద ఉన్న గద్దెల వద్దకు పగిడిద్దరాజును తీసుకెళ్లి గద్దెల పై నిలిపి సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు.ఆ తర్వాత పగిడిద్ద రాజు పడగలతో, డోలీల చప్పుల్లతో కాలి నడకన మేడారానికి బయలుదేరారు.

అలాగే ఫిబ్రవరి 21వ తేదీన సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలుకానున్న జాతర ఈ నెల 24వ తేదీన వన ప్రవేశంతో ముగిసిపోతుంది.అలాగే ఈ రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.అలాగే ఫిబ్రవరి 21వ తేదీన సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది.అలాగే ఈ నెల 23వ తేదీన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.ముఖ్యంగా చెప్పాలంటే 24వ తేదీన దేవతల వన ప్రవేశం ఉంటుందని స్థానిక పూజారులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube