ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.48
సూర్యాస్తమయం: సాయంత్రం.5.46
రాహుకాలం: మ.1.30 ల3.00
అమృత ఘడియలు: ఉ.7.30 ల9.30 మ3.40 ల5.40
దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12
మేషం:
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.
వృషభం:
ఈరోజు మీకు అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు.కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
మిథునం:
ఈరోజు పాతమిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు.వృత్తి వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం తప్పదు.ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు.అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
కర్కాటకం:
ఈరోజు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆప్తుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి.మొండి బాకీలు వసూలవుతాయి.
దీర్ఘకాలిక రుణాలను సైతం తీర్చగలుగుతారు.నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
సింహం:
ఈరోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.సంతానం విద్యా విషయాలలో దృష్టి సారిస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
ఈరోజు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి.
ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు రాజీ చేసుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
తుల:
ఈరోజు రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి.గృహమునకు బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.వారం ప్రారంభంలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.ఇతరుల నుండి డబ్బు చేతికి అందుతుంది.
వృశ్చికం:
ఈరోజు ధన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.కొన్ని పనులలో మీ అంచనాలు నిజమవుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి.
శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు.సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ధనుస్సు:
ఈరోజు మీరు గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.ఉద్యోగస్తులకు అదనపు పని భారం నుండి ఊరట లభిస్తుంది.కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి.
మకరం:
ఈరోజు చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసి వస్తాయి.ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి.
కుంభం:
ఈరోజు మొండి బాకీలు వసూలు అవుతాయి.ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మీనం:
ఈరోజు రుణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి.చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.సోదరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
DEVOTIONAL