శ్రీ‌వారి ఆశీస్సుల‌తో జలాశయాలు నిండాయి : భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో నిండిన జలాశయాలు శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హవిశేష హోమంతో విస్తారంగా వ‌ర్షాలు తిరుమలకు ఏడాదికి సరిపడా తాగునీళ్లుటీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి( Bhumana Karunakar Reddy ) శ్రీ‌వారి అనుగ్ర‌హంతో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండాయి, దాదాపు ఏడాదికి సరిపడా తాగు నీళ్లు ప్రాజెక్ట్ లలోకి వచ్చినట్లు టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు.మైచాంగ్ తుఫాను కారణంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో నిండిన జలాశయాలను ఛైర్మ‌న్ అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

 The Reservoirs Are Filled With The Blessings Of Venkateswara Swamy : Bhumana-TeluguStop.com

15 రోజుల క్రితం తిరుమ‌ల‌, తిరుప‌తి( Tirupati ) ల‌లో నీటి కొర‌త ఎక్కువ‌గా ఉన్న‌ద‌ని, దీనిని అధిగ‌మించ‌డానికి కండ‌లేరు రిజ‌ర్వాయ‌ర్ నుండి నీటిని పంపింగ్ చేయాల‌ని‌ నిర్ణయించారు.ఇంతలో భారీ వర్షాల కారణంగా ఈ రకంగా ప్రాజెక్టులు నిండి పోవడం భగవంతుని అనుగ్రహం అన్నారు చైర్మన్.

న‌వంబ‌రు 23వ తేదీ శ్రీ‌వారి పాదాల చెంత అలిపిరిలోని స‌ప్త‌గోప్ర‌ద‌క్షిణ మందిరంలో శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం ప్రారంభించిన‌ట్లు తెలిపారు చైర్మన్.ఆ రోజు నుండే స్వామివారి అనుగ్ర‌హంతో తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో ప్రారంభ‌మైన వ‌ర్షాలు, గ‌త రెండు రోజుల్లో 24 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంద‌న్నారు.

టీటీడీ అధికారులు ప‌రిస్థితిని ఎప్ప‌టి క‌ప్పుడు స‌మీక్షించి డ్యాంల నుండి నీటిని విడుద‌ల చేస్తార‌న్నారు.ఇందులో భాగంగా ఇవాళ తెల్లవారు ఝామున‌ గోగర్భం, పాప వినాశనం, ఆకాశ‌గంగ‌ డ్యామ్ గేట్లను అధికారులు తెరచి నీటిని బ‌య‌ట‌కు వ‌దిలిన‌ట్లు వివ‌రించారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube