టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలో కొత్త కొత్త యాప్స్ అందుబాటులోకి వచ్చి వినియోగదారుల పనులను వేగవంతం, సులభతరం చేస్తున్నాయి.ఇక సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డు అదుపు లేకుండా క్రమేణా పెరుగుతూనే ఉన్నాయి.
ఏ యాప్ లో వినియోగదారులు ఎక్కువగా ఉంటారో, అటువంటి యాప్ ల పైనే సైబర్ నేరగాళ్ల దృష్టి మరలుతుంది.ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల కన్ను టెలిగ్రామ్ వినియోగదారులపై పడింది.
వివిధ రకాల ఆశలు చూపిస్తూ లక్షల్లో దోచుకుంటున్నారు.సైబర్ క్రైమ్ కు వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా దాదాపు నెలకు 10 కోట్ల వరకు సైబర్ దోపిడీలు జరుగుతున్నాయి.

గతంలో వాట్సాప్ లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ లకు సంబంధించిన మెసేజ్లు పెట్టి, అమాయకులకు ఆశలు రేపి దోపిడీ చేసేవారు.అయితే సైబర్ నేరగాళ్లు దోపిడీ చేయాలంటే వాట్సప్ కంటే టెలిగ్రామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది.టెలిగ్రామ్ యాప్ లో ఎక్కువ మందికి సులువుగా చేరే అవకాశం ఉంటుంది.ఇతరులతో సులువుగా కాంటాక్ట్ అవ్వవచ్చు.కాబట్టి వేల సంఖ్యలో వినియోగదారులు టెలిగ్రామ్ యాప్ ను ఉపయోగిస్తున్నారు.కాబట్టి టెలిగ్రామ్ వినియోగదారులకు వలవేసి లక్షలు కొట్టేస్తున్నారు.

పైగా టెలిగ్రామ్ యాప్ లో మోసాలు చేస్తే తప్పించుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి.మొదట్లో వినియోగదారుల నుంచి తక్కువ పెట్టుబడి పెట్టిస్తూ, భారీగా ఆశలు చూపిస్తూ లక్షలలో పెట్టుబడులు పెట్టించి మోసాలు చేస్తున్నారు.ఇంకా గ్రూపులో బిజినెస్ లకు సంబంధించిన కొన్ని లింక్స్ పంపించి దోపిడీలు వచ్చేస్తున్నారు.ట్రై పోలీస్ కమిషనరేట్ లలో ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులలో 30 నుండి 40% వరకు మోసాలు టెలిగ్రామ్ వినియోగదారుల నుండే వస్తున్నాయి.
ఇందులో మొత్తం ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించిన మోసాలే ఎక్కువగా ఉన్నాయి.కాబట్టి టెలిగ్రామ్ వినియోగదారులు జాగ్రత్తగా ఉంటూ బిజినెస్ కు సంబంధించిన లింకులపై క్లిక్ చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.







