పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం బల్లిపాడు గ్రామంలో మిచాంగ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలతో నీట మునిగిన పొలాలను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పరిశీలించారు.ధాన్యం రాసులు నీట మునిగిపోవడంతో ధాన్యం తడిసి మొలక రాకుండా ధాన్యం రాసి చుట్టూ నీరు నిలవ ఉండకుండా రైతులతో పాటు వర్షంలో తడుస్తూ ధాన్యం రాసి చుట్టూ గాడి కొట్టి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శ్రమదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను హెచ్చరికలు గత నెలలో జారీ చేసినప్పటికీ ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతూ రైతులను అప్రమత్తం చేయకుండా ప్రతి రైతు దాల్వా పంట ఎకరానికి 45 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట
తుఫాను కారణంగా తడిసి రంగు మారి మొలక వచ్చే పరిస్థితి ఉందని రైతులు వారం రోజుల క్రితం కోతలు కోశారని ధాన్యం పట్టాలంటే ప్రభుత్వం విధించే నిబంధనలకు రైతులు బలవుతున్నారని 17% తేమశాతం ఉండాలని నిబంధనలు పెడుతున్నారని అంతకు మించి తేమ శాతం ఉంటే ధాన్యం కొనమని అంటున్నారు.వారం రోజులుగా కల్లంపై ధాన్యం ఉంటే తుఫాను ముంచుకొస్తున్నప్పుడు ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని మొలక వచ్చిన రంగు మారిన ధాన్యాన్ని ఏ విధమైన షరతులు లేకుండా ప్రభుత్వం కొని తీరాలని డిమాండ్ చేశారు.