ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో ఉన్న ఆలయాలలో( Temples ) ఏడాది పొడవునా పూజలు జరుగుతూ ఉంటాయి.ఇంకా అలాగే ప్రత్యేక రోజులు, జాతర సమయంలో అయితే భక్తులు భారీగా ఆలయాలకు తరలివస్తుంటారు.
అంతేకాకుండా ఏడాది పొడవునా దేవాలయానికి భారీగా జనాలు తరలివస్తూ ఉంటారు.అయితే ఉత్తర కన్నడలో( Northern Kannada ) కార్వార్ లోని ఆ దేవాలయంలో దర్శనం, పూజలు, పుష్కరాలు నైవేద్యాలు 7 రోజులు మాత్రమే జరుగుతాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
ఏడు రోజులు మాత్రమే ఆ దేవాలయం తెరిచి ఉంటుంది.ఈ వారం రోజులే దేవాలయంలో దేవత మూర్తిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది.
మరి మిగిలిన రోజులు దేవాలయంలో ఏం జరుగుతుంది.ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడుంది.నిత్యం అక్కడ పూజలు ఎందుకు నిర్వహించరు.ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఉత్తర కన్నడ లో కార్వార్ లోని ధనకోట గ్రామంలోని సతేరి దేవి దేవాలయం ఉంటుంది.సంవత్సరంలో 352 రోజులు రోజులపాటు భద్రంగా ఉండే శ్రీ సతేరి దేవి గర్భగుడి తలుపులు భద్రపద శుద్ధ చవతి పూర్తి అయిన మూడు రోజుల తర్వాత ఆటోమేటిక్ గా తెరుచుకుంటాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
దీనివల్ల ఏడాదిలో కేవలం 7 రోజు మాత్రమే భక్తులకు అమ్మవారి దర్శనం ఉంటుంది.ఏడు రోజుల తర్వాత జాతర ముగించి దేవాలయం తలుపులు మూసివేస్తారు.
కేవలం వారం రోజులు మాత్రమే ఈ దేవాలయం తలుపులు తెరిచి ఉండడంతో ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు.దీంతో దేవాలయ ( Temples )ప్రాంగణం అంతా దీపాలతో నిండి ఉంటుంది.అలాగే సతేరి దేవాలయంలో అమ్మవారికి భక్తులు, పూలు, పండ్లు, కాయలను సమర్పిస్తూ ఉంటారు.ఈ దేవాలయానికి గోవా, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు.
సతేరి దేవి( Sateri Devi )ని దర్శించుకుని కోరికలు నెరవేరుతాయని స్థానిక ప్రజలు నమ్ముతారు.చివరి రోజు రాత్రి సతేరి దేవికి పూజలు నిర్వహించి దేవాలయం తలుపులు మూసివేస్తారు.
ఇక అప్పటి నుంచి మళ్లీ దేవాలయం తలుపులు తెరిచే వరకు అటువైపు ఎవరు వెళ్ళరు.
LATEST NEWS - TELUGU