ఏపీలో రోడ్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్న సంగతి తెలిసిందే.కురుస్తున్న వర్షాలు దాటికి.

 Cm Jagan Gave Good News Regarding Roads In Ap , Ysrcp, Ap Cm Ys Jagan,  Ap Roads-TeluguStop.com

రోడ్లు మొత్తం గుంతలు.గుంతలుగా ఏర్పడటంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు.

అధికారంలో ఉన్న వైసీపీ కేవలం సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతుందని రోడ్ల పరిస్థితి ఏంటని జనాలు ప్రభుత్వంపై మండిపడుతూ ఉన్నారు.ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే భయాందోళన చెందే పరిస్థితి ఉందని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అర్థం కాని రీతిలో రాష్ట్రంలో రోడ్లు ఉన్నాయని.

అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లకు సంబంధించి సీఎం జగన్ గుడ్ న్యూస్ తెలియజేశారు.

విషయంలోకి వెళ్తే మార్చి 31 వ నాటికి రాష్ట్రంలో అన్ని రోడ్లు మళ్ళీ బాగు చేయాలని పేర్కొన్నారు.శుక్రవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో.అధికారులతో మాట్లాడుతూ సీజన్ ప్రారంభం కాగానే మళ్లీ డ్రైవ్ చేపట్టాలని.

తీవ్ర వర్షాల దృష్ట్యా నగరాల్లో.పట్టణాల్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించి మార్చి 31వ లోపు అన్ని రోడ్లను బాగు చేయాలని సూచించారు.

అదేవిధంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని తెలిపారు.ఇంకా జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలకి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఇంకా విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే రహదారికి ఇరువైపులా సుందరీకరణ పనులపై అధికారులు నివేదికను ముఖ్యమంత్రి జగన్ కి అందించారు.ఇంకా అనేక విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube