పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన అక్కినేని నాగార్జున!

ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలు అంటూ క్షణం తీరిక లేకుండా గడిపే వ్యక్తి పవన్ కళ్యాణ్.రెండు మహా సముద్రాలు వంటి రంగాలలో సమకాలం లో ప్రయాణం చెయ్యడం అంటే సాధారణమైన విషయం కాదు.

 Akkineni Nagarjuna Arranged A Special Flight For Pawan Kalyan, Nagarjuna , Pawa-TeluguStop.com

పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ అందరూ కెరీర్ పూర్తిగా డౌన్ అయ్యినప్పుడు రాజకీయాల్లోకి వచ్చేవారు.కానీ పవన్ కళ్యాణ్ యుక్త వయస్సులో రాజకీయాల్లోకి వచ్చాడు.

సౌత్ లో అప్పటికి పవన్ కళ్యాణ్ ని మించిన స్టార్ స్టేటస్ ఉన్నవాడు ఒక్క రజినీకాంత్ మాత్రమే.ఆ రేంజ్ పీక్ పీరియడ్ ని ఎంజాయ్ చేస్తున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసాడు.ఆరంభం లో జనసేన పార్టీ ని క్షేత్ర స్థాయిలో పెద్దగా డెవలప్ చెయ్యలేదు కానీ, 2019 ఎన్నికల తర్వాత మాత్రం అన్నీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ని బలోపేతం చేసాడు.2024 ఎన్నికలలో కచ్చితంగా టీడీపీ( TDP ) తో కలిసి ప్రభుత్వం స్థాపిస్తాడు అనే నమ్మకం అందరిలో కలిగించాడు.

Telugu Chiranjeevi, Jana Sena, Nagarjuna, Pawan Kalyan, Ram Charan, Tollywood, V

ఇదంతా పక్కన పెడితే ఈరోజు వైజాగ్ లో జరిగిన హార్బర్ మత్యకారులకు 30 లక్షల రూపాయిల ఆర్ధిక సహాయం చేసే కార్యక్రమం కి పవన్ కళ్యాణ్ తన ఫ్లైట్ ని మిస్ అయ్యాడు.సరైన సమయానికి అక్కడికి వెళ్లకపోతే సభ కి బాగా ఆలస్యం అవుతాది.మరో ఫ్లైట్ కోసం ఎదురు చూస్తే సాయంత్రం అయిపోతుంది.అందుకే పవన్ కళ్యాణ్ అక్కినేని నాగార్జున ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన వెంటనే తన ప్రైవేట్ ఫ్లైట్ ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ కోసం పంపించాడట.

అలా నేడు పవన్ కళ్యాణ్ నాగార్జున ఫ్లైట్ లో వైజాగ్ కి చేరుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.నాగార్జున కి చిరంజీవి కుటుంబం తో ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది.

చిరంజీవి తో ఆయన రిలేషన్ దాదాపుగా సొంత రక్త సంబంధం లాగానే అనుకోవచ్చు.రామ్ చరణ్( Ram Charan ) కూడా నాగార్జున కి బాగా క్లోజ్.

Telugu Chiranjeevi, Jana Sena, Nagarjuna, Pawan Kalyan, Ram Charan, Tollywood, V

కానీ పవన్ కళ్యాణ్ తో నాగార్జున కలిసినట్టు ఇన్నేళ్ల ఇండస్ట్రీ లో ఎప్పుడూ అనిపించలేదు.నాగార్జున కూడా పవన్ కళ్యాణ్ తో నాకు పెద్దగా ఇంటరాక్షన్ లేదు, ఎప్పుడైనా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు కనిపిస్తే పలకరించే వాడిని అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడగగానే తన ప్రత్యేక విమానం ని ఇచ్చాడంటే నాగార్జున కి ఆయన అంటే ఎంత అభిమానం ఉందో అర్థం అవుతుంది అని అంటున్నారు అభిమానులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube