అమెరికా వెళ్లి మంచి చదువులు చదివి, లేదా మంచి ఉద్యోగాన్ని సంపాదించాలనే ఎంతో మంది విదేశీయులు ముఖ్యంగా భారతీయుల ఆశలపై ట్రంప్ సర్కార్ రోజుకో కొత్త నిభందన అమలు చేస్తూ నీళ్ళు చల్లుతోంది.వీసాల జారీలో గతంలోనే ఖటినమైన నిభంధనలు అమలులోకి తీసుకువచ్చిన ట్రంప్ సర్కార్ మరో మారు సరికొత్త నిభందన తీసుకువచ్చింది.
వీసా కోసం అభ్యర్ధన పెట్టుకునే వారు ఇకపై సోషల్ మీడియా వివరాలు కూడా తెలుపాలని పేర్కొంది.

ఈ తాజా నిభంధనతో విదేశీయులు తలలు పట్టుకుంటున్నారు.ఈ నిర్ణయం ప్రకారం వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు ఏ పేర్లతో సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉపయోగిస్తున్నారో తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది.అంతేకాదు వారు తమ ఈ మెయిల్ ఐడీ లని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే సుమారు ఐదేళ్లుగా వాడుతున్న ఈమైల్స్ రిపోర్ట్ లని వీసా తో జత చేయాల్సిందేనట.
ఒక వేళ వీసా కి అప్ప్లై చేసుకున్న వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తే వారి అప్లికేషను తిరస్కరించడమే కాకుండా వారిపై ఖటినమైన చర్యలు కూడా తీసుకోబడతాయని హెచ్చరించింది అమెరికా.
అయితే గతంలో వీసాకి అప్ప్లై చేసుకునే వారికి ఉగ్రవాదులతో సంభంధాలు ఉన్నాయా లేదా అనే విషయం మాత్రమే పరిశీలించే వారు.కానీ తాజా ప్రతిపాదనతో అమెరికాలో ఎంట్రీ ఇవ్వబోయే వ్యక్తికి యొక్క సమగ్ర సమాచారం పూర్తిగా తెలుసుకోవడానికి ఈ తాజా నిభందన ఉపయోగ పడుతుందని అంటున్నారు.