డ్యాన్స్ రాదని, డైలాగ్స్ చెప్పడం రాదని ఏడిపించేవాళ్లు.. రోజా కామెంట్స్ వైరల్!

ప్రముఖ సినీ నటి, ఎమ్మెల్యే రోజా నిజ జీవితంలో ఎంతో ధైర్యవంతురాలనే సంగతి తెలిసిందే.ఊరిలో వినాయకుడు ఈవెంట్ లో తన డ్యాన్స్ పర్ఫామెన్స్ ద్వారా యోధ రోజా రియల్ లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.

 Star Heroine Roja Emotional In Etv Oorilo Vinayakudu Event , Emotional, Facing P-TeluguStop.com

పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.నా లైఫ్ లో డబ్బులకు, భోజనానికి కష్టాలు లేవని అమ్మానాన్న ఉద్యోగం చేయడం వల్ల ఆ ఇబ్బందులు ఎదురు కాలేదని రోజా తెలిపారు.

డాడీకి సినిమాలు అంటే ఎంతో ఇష్టమని నిర్మాతగా నాన్న నష్టపోయారని రోజా చెప్పుకొచ్చారు.నాన్న నిర్మాతగా వ్యవహరించిన ఒక సినిమాలో తాను నటించానని పేద అమ్మాయిగా ఆ సినిమాలో తాను నటించానని రోజా వెల్లడించారు.

షూటింగ్ లో అందరూ తనకు డ్యాన్స్ రాదని, డైలాగ్ చెప్పడం రాదని ఏడిపించేవాళ్లని రోజా పేర్కొన్నారు.ఆ కామెంట్లు తనను ఎంతో బాధ పడ్డాయని రోజా అన్నారు.

సెల్వమణి డైరెక్షన్ లో తెరకెక్కిన చామంతి సినిమాలో తాను హీరోయిన్ గా నటించానని అప్పటినుంచి సినిమాల విషయంలో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదని రోజా చెప్పుకొచ్చారు.నిర్మాతగా తీసిన సమరం సినిమా వల్ల తాను కష్టపడి సంపాదించిన డబ్బు అంతా అప్పులు కట్టాల్సి వచ్చిందని రోజా చెప్పుకొచ్చారు.

ఇప్పుడు తలచుకుంటే బాధ వేస్తుందని రోజా వెల్లడించారు.

Telugu Problems, Oorilo Vinayaku, Roja-Movie

తనకు పిల్లలు అంటే చాలా ఇష్టమని రోజా పేర్కొన్నారు.అన్షు దేవుడు ఇచ్చిన వర్మని కౌశిక్ పుట్టే సమయంలో తాను లేదా కౌశిక్ లలో ఒకరు మాత్రమే బ్రతుకుతారని డాక్టర్లు చెప్పారని డబ్బులు లేకపోయినా ఇద్దరు పిల్లలు ఉంటే చాలని అనిపించిందని రోజా తెలిపారు.రాజకీయాల్లో కూడా తనకు అవమానాలు ఎదురయ్యాయని రోజా వెల్లడించారు.

జబర్దస్త్ షో, సినిమాలు తన ఫ్యామిలీ కోసం చేస్తున్నానని రోజా పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube