భవనం పిల్లర్ కు కట్టేసి.. గొంతు కోసి..!

Tied To The Building Pillar Cut The Throat

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తిని ఏకంగా గ్రామ పంచాయతీ పిల్లర్ కు కట్టేసి కిరాతకంగా గొంతు కోశారు.భార్య భర్తల మధ్య నెలకొన్న గొడవల ప్రాణాలు తీసేంత వరకు వెళ్లి ఉండవచ్చని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

 Tied To The Building Pillar Cut The Throat-TeluguStop.com

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో హతమార్చినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పోలీసులు తెలుపుతున్నారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 Tied To The Building Pillar Cut The Throat-భవనం పిల్లర్ కు కట్టేసి.. గొంతు కోసి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

కోరుట్ల మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట చిన్న లక్ష్మయ్య (48) అనే వ్యక్తిని శనివారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

కుటుంబ కలహాల వల్ల హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు.చిన్న లక్ష్మయ్య ఇంట్లో అర్ధరాత్రి భార్యభర్తలకు గొడవ జరిగిందని, ఈ గొడవలో చిన్న లక్ష్మయ్య తన అత్తపై దాడికి దిగాడని గ్రామస్థులు తెలిపారు.

కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు నెలకొంటున్నాయని వారు పేర్కొన్నారు.ఈ మేరకు సర్ది చెప్పడానికి లక్ష్మయ్య అత్త ఇక్కడికి వచ్చింది.

శనివారం రాత్రి కూడా గొడవ జరిగిందని ప్రత్యక్ష సాక్షులు, గ్రామస్థులు తెలిపారు.

గొడవ పడిన అనంతరం ఏమైందో తెలియదని పోలీసులు తెలిపారు.

రాత్రికి రాత్రే లక్ష్మయ్యను గ్రామపంచాయతీ పిల్లర్ కు కట్టేసి గొంతు కోశారని పోలీసులు పేర్కొన్నారు.గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి అదనపు ఎస్పీ సురేశ్ కుమార్, డీఎస్పీ గౌస్ బాబా చేరుకున్నారు.

మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం స్థానిక కోరుట్ల ప్రభుత్వ దవాఖానాకు పోస్టుమార్టంకు తరలించారు.కేసు విచారణలోఉందని త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు.

#Tied #Jagithyala #Pillar #Throat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube