టీడీపీ( TDP ) మూడో లిస్టులో కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.ఇందులో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని( Keshineni Chinni ) పేరు ఖరారు కాగా పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బోడె ప్రసాద్ ( Bode Prasad )పేరును ప్రకటించింది.
అయితే ఆయనకు టికెట్ రాదనే ప్రచారం జోరుగా సాగగా.నిరసనలు చేసిన సంగతి తెలిసిందే.
అలాగే మరో కీలక నియోజకవర్గమైన మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇటీవల వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన వసంత కృష్ణప్రసాద్( Vasantha Krishnaprasad ) ను ప్రకటించింది.కాగా మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమను టీడీపీ అధిష్టానం పక్కనపెట్టింది.
అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.విజయవాడ ఎంపీ బరిలో కేశినేని బ్రదర్స్ నిలవనున్నారు.
వైసీసీ తరపున కేశినేని నాని, టీడీపీ నుంచి కేశినేని చిన్ని పోటీ చేయనున్నారు.దీంతో విజయవాడ ఎంపీ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.