నల్లగొండ జిల్లా:మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో విస్తరిస్తున్న విషజ్వరాలపై పత్రికల్లో వచ్చిన వార్తలపై శుక్రవారం రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ ఆర్.
వీ.కర్ణన్ తో మాట్లాడి వెంటనే సీనియర్ వైద్య బృందాన్ని ఇందుగుల గ్రామానికి పంపించి గ్రామ ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.ఒక్క ఇందుగుల మాత్రమే కాకుండా మండలంలో అన్ని గ్రామాలకు వైద్యులను పంపించి పరిస్థితిని సమీక్షించాలన్నారు.వేసవి కాలంలోఎండలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విషజ్వరాల బారినపడినట్లయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని మంత్రి కమీషనర్ దృష్టికెళ్ళారు.
తక్షణం వైద్య బృందాన్ని పంపి రోజువారి నివేదికను ఇవ్వాలని కమీషనర్ ను కోరారు.ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి ఆర్ధికంగా చితికిపోకుండా అందరికి ప్రభుత్వమే మెరుగైన వైద్య సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.
పరిస్థితి కుదుటపడేవరకు అక్కడ నిత్యం వైద్య సేవలు అందించాలని ఆదేశాలు ఇచ్చారు.