ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది జిల్లాల వారీగా బలాబలహీనతలపై దృష్టి సారించాయి ప్రధాన పార్టీలు.ముఖ్యంగా అధికార వైసీపీ ఈసారి 175 సీట్లను క్లీన్ స్వీప్ చేసే లక్ష్యంతో ఉండడంతో ప్రతి నియోజిక వర్గాన్ని కీలకంగానే భావిస్తున్నారు అధినేత జగన్మోహన్ రెడ్డి.
వైసీపీకి( YCP ) కంచుకోటగా ఉన్న నియోజిక వర్గాలు మాత్రమే కాకుండా ప్రత్యర్థి పార్టీలకు బలంగా ఉన్న నియోజిక వర్గాలపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు.అయితే గతంలో వైసీపీ గెలిచిన కొన్ని నియోజిక వర్గాల్లో ఈసారి ఆ పార్టీకి గెలుపు కష్టమే అనే వాదన వినిపిస్తోంది.
ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈసారి వైసీపీకి గట్టి షాక్ తగిలి అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉమ్మడి గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.కానీ ఈసారి ఆ జిల్లాల్లో జనసేన( Jana sena ) హవా గట్టిగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు జనంసేన పార్టీలో చేరారు.
దీంతో ఈసారి ఉభయగోదావరి జిల్లాల్లో మెజారిటీ స్థానాలను జనసేన పార్టీ గెలుచుకోవడం ఖాయమే అనే వాదన వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ మాట్లాడుతూ వైసీపీకి గతంలో మాదిరి పరిస్థితులు ఇప్పుడు లేవని.
ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటు గెలుచునే అవకాశాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
అధినేత జగన్( YS Jagan Mohan Reddy ) లో కూడా ఈ తరహా అనుమానాలు ఉన్నట్లు సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.దాంతో ఉమ్మడి గోదావరి జిల్లాలో అభ్యర్థుల విషయంలో చాలావరకు మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు వినికిడి.ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొంత మందిని మార్చి కొత్తవారిని బరిలో దించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు టాక్.
తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి మాత్రమే కాకుండా నెల్లూరు, చిత్తూరు వంటి జిల్లాల్లో కూడా జగన్ భారీగా మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరి 175 నియోజిక వర్గాల్లో విజయమే లక్ష్యంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎంత వరకు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారో చూడాలి.