రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరనేది జగమెరిగిన సత్యం.అంతా అవసరాలకు అనుగుణంగా మిత్రుత్వం శతృత్వం రూపాంతరం చెందుతూ ఉంటుంది.
తెలంగాణలో ఎన్నికలు( Telangana Elections ) దగ్గర పడుతుండడంతో ఈ తరహా రాజకీయాలు ఎక్కువయ్యాయి.తాజాగా వామపక్షాల విషయంలో కేసిఆర్( CM KCR ) వైఖరి కమ్యూనిస్ట్ పార్టీలను నిండా ముంచినట్లే కనిపిస్తోంది.
మునుగోడు బైపోల్ సమయంలో వామపక్షాలతో దోస్తీ ఏర్పరచుకున్న కేసిఆర్.తీర సాధారణ ఎన్నికలు వచ్చే సరికి కమ్యూనిస్ట్ పార్టీలకు కటిఫ్ చెప్పేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కమ్యూనిస్ట్ పార్టీల( Communist Party ) ప్రభావం కాస్త ఎక్కువే అయినప్పటికి.సీట్ల కేటాయింపు విషయంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారికే ప్రదాన్యం ఇచ్చారు కేసిఆర్.దీంతో కేసిఆర్ ఇచ్చిన షాక్ కు కమ్యూనిస్ట్ పార్టీలు కుదేలు అవుతున్నాయి.కేసిఆర్ మిత్రద్రోహి అని, కేసిఆర్ ఇలా వ్యవరిస్తారని అసలు ఊహించలేదని గగ్గోలు పెడుతున్నారు వామపక్ష నేతలు.
ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో( Congress Party ) వామపక్షాల పొత్తు కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.వచ్చే ఎన్నికల్లో కేసిఆర్ రెండు చోట్ల పోటీ చేయనుండడంతో కేసిఆర్ కు పోటీగా కాంగ్రెస్ మరియు వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారట.
ఎలాగైగా ఈ ఎన్నికల్లో కేసిఆర్ ను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని వామపక్ష నేతలు చెబుతున్నారు.అయితే ఏంఐఏం పార్టీ( MIM Party ) విషయంలో మాత్రం కేసిఆర్ స్పష్టతనిచ్చారు.వచ్చే ఎన్నికల్లో ఏంఐఏం పార్టీతో కలిసి హైదరబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్నీ స్థానాలను కైవసం చేసుకుంటామని కేసిఆర్ చెప్పుకొచ్చారు.దీంతో మజ్లిస్ పార్టీని కూడా కేసిఆర్ అవసరనికే వాడుకుంటున్నారని, తీర ఎన్నికల తరువాత ఆ పార్టీతో కూడా దోస్తీకి గుడ్ బై చెప్పిన ఆశ్చర్యం లేదని కొందరు రాజకీయ వాదులు చెబుతున్నారు.
మొత్తానికి బిఆర్ఎస్ తో దోస్తీ ఉందనుకొని కేసిఆర్ ను నమ్ముకున్న వామపక్షాలు ఇప్పుడు నిండామునుగిపోయాయని చెప్పవచ్చు.