దేవాలయం( Temple ) పవిత్రమైన స్థలమని మన దేశంలో చాలామంది ప్రజలు కచ్చితంగా చెబుతారు.అలాగే కొంత మంది ప్రజలు దేవాలయం పరిసర ప్రాంతాలలో ఇల్లు ఉండకూడదని కూడా చెబుతూ ఉంటారు.
అలా ఇల్లు ఉంటే మనకే నష్టం జరుగుతుందని కూడా చెబుతూ ఉంటారు.ఎందుకంటే దేవాలయం నుంచి వచ్చే తరంగాలను తట్టుకోనే శక్తి ఇంటికి ఉండదు.
అందుకే దేవాలయం దగ్గర ఇల్లు ఉండకూడదని చెబుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే ధ్వజస్తంభం నీడ కూడా ఇంటి పై పడకూడదు.
అలా పడితే మనకే అరిష్టమని చెబుతూ ఉంటారు.దీనివల్ల దేవాలయ పరిసర ప్రాంతాలలో ఇల్లు నిర్మించకూడదని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయం నీడ పడే ఇంట్లో సుఖశాంతులు ఉండవు.మనశ్శాంతి లోపిస్తుందని పండితులు చెబుతున్నారు.ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయానికి కనీసం 200 అడుగుల దూరంలో ఇల్లు ఉంటే ఎలాంటి నష్టం ఉండదని పండితులు చెబుతున్నారు.
కానీ దేవాలయానికి సమీపంలో ఉంటే ఇబ్బందులు వస్తాయి.ఇంటికి గుడికి ఉండే దూరాన్ని గర్భగుడిలో ఉండే మూలవిరాట్ విగ్రహం నుంచి లెక్కలోకి తీసుకుంటే మన ఇల్లు ఎంత దూరం ఉందో తెలుసుకోవచ్చు.

ఇంకా చెప్పాలంటే శివాలయా( shivalayam )లకు వెనుక, విష్ణు ఆలయానికి ముందు ఇల్లు ఉండవచ్చు.శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రుభయం కలుగుతుంది.విష్ణు దేవాలయానికి దగ్గరలో ఉంటే ఆ ఇంట్లో డబ్బు నిలవాదని పండితులు చెబుతున్నారు.అమ్మ వారి దేవాలయానికి దగ్గరలో ఉంటే ఆ ఇంట్లో పురోగతి ఉండదని చెబుతున్నారు.
వినాయకుడి దేవాలయం( Ganesha Temple ) ఉత్తరం వైపు ఇల్లు ఉంటే ధన నష్టం కలుగుతుంది.పూర్వం దేవాలయాలు నదీ తీరంలోను, పర్వతాల పైన నిర్మించేవారు.
దీంతో ఎలాంటి ఇబ్బందులు వచ్చేవి కాదు.ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్న నగరాలతో దేవాలయాలు మధ్యనే ఉంటున్నాయి.
దేవాలయాలకు సమీపంలో ఇల్లు నిర్మించుకోవడం సురక్షితం కాదు.ఈ విషయం తెలుసుకొని దేవాలయాల సమీపంలో ఇంటిని నిర్మించుకునే పనులు మానుకోవడమే మంచిది అని చెబుతున్నారు.