ఈశాన్య దిశలో ఈ వస్తువులను అస్సలు ఉంచకూడదు.. ఉంచితే మాత్రం..!

వాస్తు శాస్త్రంలో( Vastu Shastra ) ఈశాన్య దిశను ఈశాన్య కోణమని కూడా పిలుస్తూ ఉంటారు.ఇంటి యొక్క ఈ దిశా చాలా ముఖ్యమైనది.

 These Things Should Not Be Placed In The North-east Direction , North-east Direc-TeluguStop.com

పవిత్రమైన ఈ దిక్కు ఆరోగ్యం, ఆనందం, సంపదలతో నేరుగా సంబంధం కలిగి ఉందని పెద్దవారు చెబుతూ ఉంటారు.తూర్పు ఉత్తరం మధ్య దిశను ఈశాన్య దిశ అని పిలుస్తారు.

ఉదయం సూర్య రశ్మి సోకే దిక్కు.సూర్య రశ్మికి అనారోగ్యాన్ని దూరం చేసే శక్తి ఉంటుంది.

అలాగే ఇంట్లో ఈశాన్య దిశలో ఉండకూడని వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈశాన్య దిక్కులో అపరిశుభ్రంగా అసలు ఉండకూడదు.

లేదంటే ప్రతికూల ఫలితాలు వస్తాయి.

Telugu Animal Symbols, Camphor, Sea Salt, Vastu, Vastu Tips-Telugu Bhakthi

అలాగే ఈశాన్య దిశలో మరుగుదొడ్డి ఉంటే దానిని తొలగించాలి.మరుగుదొడ్డి ఉంటే ఇల్లు వ్యాధులకు నిలయంగా మారుతుంది.మరుగుదొడ్డిని వెంటనే తొలగించడం సాధ్యం కాకపోతే ఆ మరుగుదొడ్డిలో ఒక గాజు గిన్నెలో సముద్రపు ఉప్పు, కర్పూరం( Sea salt, camphor ), పటిక ఉంచడం మంచిది.

ఈశాన్య దిశలో మరుగుదొడ్డి ఉంటే అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.వంటగదిని మార్చడం సాధ్యం కాకపోతే గ్యాస్ బండ కింద ఆకుపచ్చ లైట్ లేదా రాయిని ఉంచాలి.వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య మూలను మూసివేసినట్లుగా గదులు కానీ, ఏ విధమైన కట్టడాలు కానీ నిర్మించకూడదు.

Telugu Animal Symbols, Camphor, Sea Salt, Vastu, Vastu Tips-Telugu Bhakthi

ప్రధాన ద్వారం దగ్గర జంతువుల చిహ్నాలు( Animal symbols ) ఉంచకూడదు.ఈ దిశలో లోపల గాని, బయట గాని మెట్లు ఉండకూడదు.ఈశాన్యంలో బెడ్ రూమ్ ఉండకూడదు.

అలాగే ఈశాన్య దిక్కులో పూజగది ఉండడం మంచిది.ఈశాన్య దిక్కులో దేవుడి చిత్రపటాలు ఉండడం మంచిదే.

ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు ప్రధాన ద్వారం ఈ ఈశాన్యంలో నిర్మించుకోవాలి.ఇతర ద్వారాల కంటే ఇది పెద్దదిగా ఉండాలి.

అలాగే ప్రధాన ద్వారానికి శుభ చిహ్నాలతో తోరణాలు అలంకరించాలి.ఈ దిశలో ఎలాంటి బరువులు ఉండకూడదు.

ఈశాన్య మూల పెరిగి ఉన్న స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే సకల సంబరాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.బోరు నిర్మాణం ఈశాన్యంలో ఉంటే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube