ఈ ఏడాది సంక్రాంతి పండుగ ఘనంగా ముగిసింది అనే చెప్పాలి.సంక్రాంతి పండుగ కానుకగా ఎప్పటి లాగానే ఈసారి కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొంది.2023 సంక్రాంతి కానుకగా మొత్తం నాలుగు సినిమాలు బరిలోకి దిగాయి.టాక్ పరంగా నాలుగు సినిమాలు బాగానే రాగా కలెక్షన్స్ కూడా అదర గొడుతున్నాయి.
ఈ ఏడాది సంక్రాంతి విజేతగా వాల్తేరు వీరయ్య సినిమా నిలిచింది.మెగాస్టార్ నటించిన ఈ సినిమా 150 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేస్తుంది.
2023 ఇక అలా ముగిసిందో లేదో అప్పుడే 2024 పోటీ గురించి చర్చ జరుగుతుంది.ఈ మెగా వర్సెస్ నందమూరి మధ్య వార్ జరిగింది.
ఇక వచ్చే ఏడాది మెగా వర్సెస్ మెగా మధ్య గట్టి పోటీ ఉండబోతుంది అని తెలుస్తుంది.మెగా కాంపౌండ్ నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈసారి మెగా పవర్ స్టార్ పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య పోటీ జరగబోతుందట.
ప్రెజెంట్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప 2.అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఇక రామ్ చరణ్ ప్రెజెంట్ నటిస్తున్న సినిమా ఆర్సీ15.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.అలాగే పుష్ప 2 సినిమా కూడా ఇప్పుడే షూట్ స్టార్ట్ కావడంతో ఈ సినిమాను కూడా మైత్రి వారు వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారట.ఇలా వచ్చే ఏడాది మెగా వర్సెస్ మెగా పోటీ తప్పేలా లేదని వార్తలు వస్తున్నాయి.చూడాలి ఈ ఇద్దరు పోటీ పడతారో లేదో.