బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ జీరో సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు.దాదాపు పది సంవత్సరాలుగా షారుఖ్ ఖాన్ కి సక్సెస్ లు లేవు.
అయినా కూడా ఆయన నుండి వచ్చే వారం రాబోతున్న పఠాన్ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.కేవలం హిందీలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా పఠాన్ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు.
దాదాపుగా 250 కోట్ల బడ్జెట్ తో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన పఠాన్ సినిమా ను అదే టైటిల్ తో తెలుగు లో విడుదల చేయబోతున్నారు.అందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారట.
తెలుగు లో డబ్బింగ్ చేసి హిందీ సినిమాలు విడుదల చేయగా ఈమధ్య కాలంలో పాజిటివ్ రెస్పాన్స్ దక్కలేదు.అయినా కూడా చాలా తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పఠాన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల రూపాయల వసూళ్లు సాధించాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నారు.అందుకే కాస్త ఎక్కువగానే ప్రమోషన్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా మల్టీ ప్లెక్స్ ల్లో ఈ సినిమా యొక్క సందడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.భారీ అంచనాల నడుమ రూపొందిన పఠాన్ సినిమా ను తెలుగులో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా విడుదల చేస్తున్న కారణంగా కచ్చితంగా మ్యాటర్ ఉన్న సినిమా అయ్యి ఉంటుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.పఠాన్ సినిమాను తెలుగు డబ్బింగ్ రైట్స్ ను బయ్యర్లు దాదాపుగా 7.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది.అందుకే పది కోట్ల రూపాయల వసూళ్లు నమోదు అయితే సేఫ్ ప్రాజెక్ట్ గా పఠాన్ నిలిచినట్లు అవుతుంది అనడంలో సందేహం లేదు.దీపికా పదుకునే యొక్క బికినీ వివాదం కారణంగా తెలుగు లో కూడా పఠాన్ కు మంచి క్రేజ్ వచ్చింది.
అందుకే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పోటీ లేని సమయంలో పఠాన్ తెలుగు లో వస్తుంది.కనుక కచ్చితంగా కుమ్మేయడం ఖాయం అనిపిస్తుంది.