మన తెలంగాణ రాష్ట్రంలోని రెండవ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాత పుణ్యక్షేత్రంలో మాఘ మాస అమావాస్య స్నానాలకు ఏర్పాట్లను పూర్తి చేశారు.ఈరోజు మొదలుకానున్న మాఘ జాతరకు పాలకమండలి సభ్యులు అధికారులు ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేశారు.
దేవి క్షేత్రంలో జరగనున్న జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని దేవాలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏడుపాయల వన దుర్గ దేవి క్షేత్రంలో మాఘ అమావాస్య మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకొని జాతర ఉత్సవాలు ఘనంగా, వైభవంగా నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.మాఘ అమావాస్య జరుపుకునీ ఏడుపాయల్లో జరగనున్న జాతర ఏర్పాట్లు కోసం ఏడుపాయల ఆలయ చైర్మన్ సాతేల్లి బాలగౌడ్,
ఈవో సారా శ్రీనివాస్ దేవాలయ పాలక మండలి సభ్యులు, సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు.చెలిమెలకుంట ప్రాంతంలో పార్కింగ్ కోసం నేలను చదును చేసే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఉంచారు.అంతే కాకుండా కోల్చారం వైపు నుంచి వచ్చే భక్తుల కోసం నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు.
వీటితో పాటు దేవాలయం ముందు ప్రత్యేకమైన భారీకేట్లు అలాగే పర్మినెంట్ వీఐపీల క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసి ఉంచారు.
దేవాలయ పరిసరాల్లో రంగు రంగుల విద్యుద్దీప లను అలంకరించారు.అమ్మ వారి దేవాలయం ముందు మండపానికి రంగులు వేసి ముస్తాబు చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు.ఏడుపాయల జాతరకు సంబంధించిన దుకాణాలు కూడా మొదలయ్యాయి.భక్తులు స్నానం చేశాక దుస్తువులు మార్చుకోవడానికి సైతం తాత్కాలిక ఏర్పాట్లను నిర్వహించారు.108 సదుపాయాన్ని కూడా భక్తుల కోసం కల్పించినట్లు దేవాలయ అధికారులు వెల్లడించారు.
DEVOTIONAL