మన భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాలు నాటి పురాతనమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతి రోజు ఎన్నోవేల మంది భక్తులు వెళ్లి పూజలు చేసి భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు.
అయితే గుజరాత్ లోని సూరత్ లో ప్రసిద్ధి చెందిన శివాలయాలలో రామ్నాథ్ శివకేలా పుణ్యక్షేత్రం ఒకటి.ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం సజీవ పీతలను పరమా శివుడికి సమర్పిస్తారు.
ప్రతి సంవత్సరం జనవరిలో మకర సంక్రాంతి రోజు నుండి పీతల పూజ జరుగుతుంది.ఈ దేవాలయం రామాయణంలో ప్రస్తావించబడింది.
రాముడు స్వయంగా ఈ దేవాలయాన్ని నిర్మించాలని అక్కడి స్థానిక భక్తులు చెబుతూ ఉంటారు.ఆ సమయంలో ఏకాదశి రోజున ఈ దేవాలయంలో పీతలతో పూజించిన వారందరికీ పుణ్యఫలం లభిస్తుందని ఆలయ పూజారి మనోజ్ గిరి గోస్వామి చెబుతున్నారు.
ఇలా చేయడం వల్ల శరీరంలోని వ్యాధులు నయమైపోతాయని చాలామంది భక్తులు నమ్ముతారు.ముఖ్యంగా చెవికి సంబంధించిన చెవిటితనం, చెవి నొప్పి, వినికిడి లోపం మొదలైన వ్యాధులు దూరమైపోతాయని భక్తులు గట్టిగా నమ్ముతారు.ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి భక్తులు ఉదయం నుంచి సజీవ పీతలతో దేవాలయానికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు.ఉమ్రా దానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ మహాదేవుని ఆలయానికి సజీవ పీతులను సమర్పించడానికి భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు.
ఈ సంప్రదాయం ఈ దేవాలయంలో చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ చెవి నొప్పి ఉంటే ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వారు శివుడిని వేడుకుంటూ ఉంటారు.చెవిపోటు నుంచి ఉపశమనం పొందిన వెంటనే వారు సజీవ పీతలను స్వామికి సమర్పిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ జీవించి ఉన్న పీతలను ఆలయ ట్రస్ట్ సురక్షితంగా తాపీ నదిలోకి వదులుతుంది.అయితే ఈ నమ్మకం చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తోంది.