రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాయకుల వారసులు తహతహలాడుతున్నారు.ప్రస్తుతం ఏపీలో టీడీపీకి ప్రజాదరణ పెరగడంతో… రాజకీయాల్లోకి వెళదామా .? వద్దా …? అని ఎటూ తేల్చుకోలేక తటస్థంగా ఉండిపోయిన కొంతమంది నాయకులు ధైర్యంగా ఇప్పుడు తమ మనసులో మాట చెబుతున్నారు.ఈ సంగతి ఇలా ఉంటే చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ పొలిటికల్ ఎంట్రీపై గత కొంతకాలం నుంచి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
భరత్ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తారని టాక్ వచ్చినా… అటు భరత్ నుంచి గాని ఇటు టిడిపి నుంచి కానీ స్పందన రాలేదు.

అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చింది అనుకున్నాడో ఏమో గాని… తనకు వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్ సభ నుంచి టిడిపి తరఫున పోటీ చేయాలని ఉందని భారత్ తన మనసులో మాట బయటపెట్టేసాడు.అంతేకాకుండా ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని… రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం అవ్వాలని ప్రజలు భావిస్తున్నారని భరత్ పొగడ్తల వర్షం కురిపించాడు.







