ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా చనిపోవాల్సిందే.ఈ విషయం దాదాపు భూమి మీద జీవిస్తున్న అందరికీ తెలుసు.
అయినా కూడా చాలామంది ఈ భూమి మీద శాశ్వతంగా ఉంటాము అనిలాగా జీవిస్తూ ఉంటారు.ఈ భూమి నా సొంతం అని, ఈ ఆస్తి నా సొంతం అని చాలా మంది చెబుతూ ఉంటారు.
కానీ ఈ భూమి ఎప్పటికీ ఎవరి సొంతం కాదు మనమే ఎప్పటికైనా ఈ భూమి సొంతం అవ్వాల్సిందే.కచ్చితంగా చెప్పాలంటే ఈ భూమి మీద జీవిస్తున్న ఎవరి కుటుంబంలో అయినా ఎవరో ఒకరు చనిపోయే ఉంటారు.
అలా చనిపోయిన వారు ఆ కుటుంబ సభ్యుల కలలలో కనిపిస్తూ ఉంటారు.ఇలా చాలామందికి కలలు అనేవి వస్తూ ఉంటాయి.
కొందరికి జంతువులు పక్షులు కనిపిస్తే మరికొంతమందికి తమ పూర్వికులు, స్నేహితులు కనిపిస్తూ ఉంటారు.
అయితే కలశాస్త్రం ప్రకారం చనిపోయిన మనిషి కలలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.చనిపోయిన స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ మన కలలో కనిపిస్తే రామాయణం, భగవద్గీత పారాయణం చేస్తే మంచిది.అంతేకాకుండా మన కుటుంబ సభ్యులలో ఎవరైనా కలలో ఆకలితో బాధపడుతున్నట్లు కనిపిస్తే వెంటనే పేదవారికి అన్నదానం చేయడం మంచిది.
ఇంకా చెప్పాలంటే మన పూర్వీకులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ కలలో ఏమీ మాట్లాడకుండా బాధతో కనిపిస్తే మనం ఏదో తప్పు చేయబోతున్నట్లు సంకేతం అని అర్థం చేసుకోవాలి.ఒకవేళ చనిపోయిన పూర్వీకులు కోపంతో మీ కలలో కనిపిస్తే వారు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
అందువల్ల మన పూర్వీకులు మన కలలో కనిపించి ఏదైనా చెప్తే దాన్ని చేయాలని వేద పండితులు చెబుతున్నారు.అలా చేస్తే మన పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది.