శని దేవునికి ఇష్టమైన ఈ దేవతలను పూజిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయా..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన దేశస్తులు శని దేవుని పేరు వినగానే మనసులో ఏదో తెలియని భయం వారిలో ఉంటుంది.శని దేవుని చెడు ప్రభావం వల్ల చాలామంది ఎన్నో రకాల కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.

 If You Worship These Gods That Are The Favorite Of Shani, Will The Financial Pro-TeluguStop.com

జాతకంలో శని గ్రహ స్థానం దిగువన ఉంటే తీవ్ర నష్టాలే కాకుండా అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రాన్ని పనులు చెబుతున్నారు.శని దేవుని జ్యోతిష్య శాస్త్రంలో న్యాయదేవతగా చెబుతూ ఉంటారు.

కర్మలను బట్టి శని దేవుడు వారికి తగిన ఫలితాలను ఇస్తాడు.అయితే శని చెడు ప్రభావం వల్ల తీవ్ర ఇబ్బందుల పాలవుతున్న వారు శని దేవునికి ఇష్టమైన దేవత లను పూజించడం వల్ల శని దేవుని అనుగ్రహం వారిపై కలిగి జీవితంలో మంచి ప్రయోజనాలు పొందుతారు.

ఏ దేవతలను పూజించడం వల్ల శని దేవుని అనుగ్రహం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Astrology, Devotional, Hanuman, Lord Krishna, Lord Shani, Pooja-Latest Ne

ముఖ్యంగా కృష్ణుని భక్తులకు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.శని దేవుడు కుంభ రాశిలోకి సంచారం చేసిన తర్వాత కృష్ణుడిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా కుటుంబంలో శాంతి నెలకొంటుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.శివ భక్తులకు కూడా ఈ సంచారం కారణంగా శని అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి ఈ క్రమంలో శివ భక్తులంతా శని దేవుని పూజించడమే కాకుండా శివనామస్మరణ చేయాల్సి ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల వారిపై అనుగ్రహం ఉండడమే కాక మంచి ఫలితాలను కూడా పొందుతారు.

మంగళవారం రోజున శని దేవుని కాకుండా హనుమంతుని కూడా పూజించడం చాలా రోజుల నుంచి ఆనవాయితీ వస్తోంది.అయితే మంగళవారం రోజున శని దేవునితో పాటు ఆంజనేయస్వామి పూజించడం వల్ల శని చెడు ప్రభావం దూరమయ్యే అవకాశం ఉంది.

అంతేకాకుండా చెడు ప్రభావం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube