నిత్యం పెరిగే కాణిపాకం వరసిద్ధి వినాయకుడి స్థల పురాణం.. మీకోసమే!

సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కిన కాణిపాకం వరసిద్ధి వినాయుకుడి గురించి తెలుపు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే చిత్తూరు జిల్లా కాణిపాకంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయ పురాణం గురించి చాలా మందికి తెలియదు.

 Kanipakam Vara Siddhi Vinayaka Sthala Puranam , Kanipakam Vara Siddhi Vinayaka ,-TeluguStop.com

అయితే ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.దాదాపు వెయ్యేళ్ల క్రితం ఈ ఆలయం నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

పూర్వం విహార పురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు.కర్మఫలాన్ని అనుభవిస్తూ… ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించే వారు.

ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది.

గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది.

కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు.ఆ మేరకు బావి తవ్వుతుండగా… ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది.

దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది.రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే వాళ్ల వైకల్యం తొలగింది.

జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు.బావిలో గణనాథుని రూపం కనిపించింది.

గ్రామస్థులు దాన్ని భొక్తి శ్రద్ధలతో పూజించి స్వామి వారికి కొబ్బరి కాయలు సమర్పించారు.స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరి కాయల నీరు కాణి భూమి… కాణి అంటే ఎకరం పొలం అని అర్థం.

ఇలా పేరు పొందింది.అప్పటి నుంచి విహార పురి గ్రామానికి కాణిపారకరమ్ అన్న పేరు వచ్చింది.

కాలక్రమంలో అదే కాణిపాకంగా మారిందని ప్రశస్తి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube