తిరుమల పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి.ఈ ప్రశస్తికి మూల కారణం.
స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీ వేకంటేశ్వరుడు.తిరుమల గిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామ శిల ద్వార స్యయంభూగా వెలిసిన శ్రీ వేంకటేశ్వరుడిని శ్రీనవాసుడని సంబోధిస్తున్నారు.
అయితే నాటి నుంచి నేటి వరకూ తిరుమల శ్రీవారి పుణ్య క్షేత్రానికి భక్తులు రాక నానాటికీ పెరుగుతూ వస్తోంది.అయితే కలియుగారంభంలో… అనగా సుమారు 5 వేల సంవత్సరాల క్రితం వక్ష స్థల మహాలక్ష్మీ సమేతంగా ఆవిర్భవించిన శ్రీనివాసునిడి తరతరాలుగా ఎందరో భక్తులు మందిర, గోపుర, ప్రాకార, మహా ద్వారాలు నిర్మిస్తూ వచ్చారు.
వేంటకపతికి నిత్యోత్సవ, వార్షికోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.నారాయణవనం అధిపతులు ఆకాశ రాజు, తొండమాన్ చక్రవర్తి, పల్లవరాణి సామవై, విజయ నగర సామ్రాజ్యాధీశులు సాళువ నరసింహరాయులు, శ్రీకృష్ణ దేవరాయులు, తిరుమలరాయులు, అచ్యుతరాయులు ఇలా… ఎందరో మహానుభావులు.
ఇక్కడ అధ్భుత నిర్మాణాలను చేపట్టి అపూర్వ సేవా కైంకర్యాల నెలవుగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దారు.అలాగే శ్రీవారిని దర్శించుకునే భక్తులు ముందుగా క్షేత్రపాలకుడైన వరాహ స్వామిని దర్శించుకోవాలని స్థల పురాణంలో ఉంది.
అలాగే స్వామి వారి దర్శనానంతరం… తిరుపతిలో పద్మావతి, బీబీనాంచాలి, అలివేలు మంగ అమ్మవారిని, గోవిందరా స్వామి వారిని దర్శించుకోవాలి.తిరుమలగిరుల్లో ఉన్న పవిత్ర అకాశ గంగ, పాపనాశనం, వకుళమాత, పథీరాంజీ మఠం, త్రిదండి జీయర్ స్వామి మఠం, వన్య ప్రాణుల పార్క్.
వంటి ఆథ్యాత్ిక పర్యాటక ప్రాశస్త్యమున్న ప్రాంతాల్ని దర్శించుకోవచ్చు.