జపమాల ఫలములు ఏమిటి ?

వ్రేలు కణుపుతోచేసినచో ఒకటికి ఒకటియే ఫలము, వ్రేలు పర్వములతో చేసినచో 8 రెట్లు పుణ్య ఫలము. పుత్ర జీవములతోచేసినచో (ఒక జాతి చెట్టు విత్తనము) 10 రెట్లు, శుఖమణితో జపము చేసినచో 100 రెట్లు, ప్రవాళ (పగడముల) మాలతో జపము చేసినచో వేయి రెట్లు, ముత్యాల మాలతో జపము చేసినచో పది వేల రెట్లు, బంగారు పూసల మాలతో జపం చేసినచో పది కోట్ల రెట్లు, తెల్లని పద్మపు పూసలతో జపము చేసినచో అమిత ఫలము, దర్భముడులతోకానీ, తులసీ కాష్ట మాలతోకానీ జపము చేసినచో చెప్పుటకు వీలులేనంత పుణ్య ఫలము కలుగును.

 What Is The Benifit Of Japamala Details, Importance Of Japamala, Japamala, Japam-TeluguStop.com

శంఖములు, అక్షముల, మణులు, వీటితో చేసిన మాల = లక్ష్మీ ప్రదము , స్పటికమాల మోక్షదాయకము, తామర పూసల మాల పుష్టికరము, రుద్రాక్ష మాల భుక్తి, ముక్తుల నొసంగును, పుత్ర జీవ ముల (ఒకజాతి చెట్టు గింజలు) మాల పశు,పుత్ర, ధాన్యప్రదము, పగడముల (ప్రవాళ) మాల ధనము, వశ్యము, ముత్యమాల సౌమంగల్యము ఇచ్చును, దర్భముడుల మాల పాపము నశించును, బంగారు, వెండి పూసల మాలకోరిన కోర్కెలు తీరును,

పగడములూ, ముత్యములూ, స్పటిక ములూ కలిసినమాల కోటి రెట్ల ఫలము, తులసీ, రుద్రాక్షమాలలు అక్షయ ఫలము, వ్రేళ్ళతోజపించినచో సామాన్య ఫలము, కణుపులతో జపిం చిన రెట్టింపు ఫలము, కణుపుల మధ్య గీతలతో చేసిన పది రెట్లు ఫలము, శంఖమాల నూఱు రెట్లు, ప్రవాళ (పగడ)మాల వేయి రెట్లు, స్పటిక మాల పదివేల రెట్లు, ముత్యాల మాల లక్షల రెట్లు, తామర పూసల మాల పది లక్షల రెట్లు, సువర్ణ మాల కోటి రెట్లు, మాల నూఱు కోట్ల రెట్లు, తులసీ, రుద్రాక్షమాలలు అనంత, అక్షయ ఫలము.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube