వాల్మీకి రామాయణం రాముడి జననానికి ముందు రాశారా.. తర్వాతా?

వాల్మీక త్రేతాయుగంలో రాముడు జీవించి ఉన్నప్పుడే రామాయణాన్ని రచించినట్లు రామాయణం చెప్తోంది.ఆ మహర్షి ఒకరోజు మద్యాహ్నం తమసా నదికి స్నానానికి వెళ్లాడు.

అక్కడ ఒక బోయవాడు క్రౌంచ పక్షల జంటల్లో ఒక పక్షిని బాణంతో కొట్టి చంపాడు.అది చూసి శోకానికి గురి అయిన వాల్మీకి అతడిని శపించాడు.

ఆ శాప వచనం ఛందో బద్దంగా ఆయన నుండి వెలువడింది.ఆశ్రమానికి వెళ్లి దాని గురించి ఆలోచిస్తూ ఉండగా.

బ్రహ్మ ప్రత్యక్షమై రుషీ.నీకు శద్ద బ్రహ్మం స్వాధీనం అయింద.

Advertisement

ఆర్ష దృష్టితో నీవు రాముని చరిత్రను చెప్పు అని అంతర్థానం అయ్యాడు.తర్వాత నారద మహర్షి వాల్మీకి చెంతకు వచ్చి.

ఆ లోకంలో ఇప్పుడు గుణ వంతుడూ, వీర్య వంతుడూ, ధర్మజ్ఞుడూ, ఏక ధర్మ పత్ని.ఇలా పదనారు గుణాలు కల్గిన వాడు ఎవడు అని ప్రశ్నించాడు.

అప్పుడు వాల్మీకి.నారదా అలాంటి వాడు ఒక్క అయోధ్య అధిపతి శ్రీ రామ చంద్రుడు మాత్రమే అని చెప్పి రామ కథను సంగ్రహంగా వివరించాడు.

ఈ లోకంలో ఇప్పుడు ప్రశ్నించడాన్ని బట్టి అప్పుడు రాముడు రాజ్యం చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.అందుచేత వాల్మీకి రామాయణాన్ని రాముని జననం తర్వాతే రాశడని తెలుస్తోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
These Face Packs Help To Get Smooth Skin Details Face Packs

రామాయణ మహా కావ్యం ఏడు కాండాలుగా విభజించబడి ఉంది.అయితే వాల్మీకి రాసిన రామాయణంలోనివి ఆరు కాండలు.

Advertisement

వేల శ్లాకాలు అని చెబుతారు.ఏడవ కాండం అయిన ఉత్తర కాండం వాల్మీకి రచన కాదంటారు.

తాజా వార్తలు