మ‌హారాష్ట్ర‌లో ఈరోజు ఇంటింటా జెండా రెప‌రెప‌లు.. ఎందుకంటే..

ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభం జనవరి 1 న ప్రారంభ‌మ‌వుతుంది.ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభ‌మ‌వుతుంది.

 Maharashtra New Year Start From 2 April Maharashtra, New Yea , 2 April , Gudi Pa-TeluguStop.com

మహారాష్ట్రలో చైత్ర మాసంలోని శుక్ల ప్రతిపద నాడు గుడి పడ్వా జరుపుకుంటారు.దీనిని ఉగాది అని కూడా పిలుస్తారు.విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మ.ఉగాది రోజునే ప్రపంచాన్ని సృష్టించాడని హిందువులు నమ్ముతారు.అందుకే ఈ రోజును నవ సంవత్సరంగా అంటే నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. మహారాష్ట్రలోని హిందూ కుటుంబాల‌వారు ఈరోజు ఇంటి ముఖద్వారాన్ని మామిడి ఆకుల‌తో అలంకరిస్తారు.

ఈ రోజున శ్రీరాముడు.వాలి దుష్టపాలనను అంతం చేశాడ‌ని, అత‌ని చెర నుంచి దక్షిణ భారతదేశంలోని ప్రజలను విడిపించాడని చెబుతాడ‌రు.

దీనికి ప్రతీక‌గా ప్రతి ఇంటిలో విజయ పతాకాన్ని ఎగురవేస్తారు.ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

భారతదేశ జాతీయ క్యాలెండర్ శ‌క‌ సంవత్స‌రం ఆధారంగా రూపొందించారు.చైత్ర మొదటి మాసం.

దీని తర్వాత వైశాఖం, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావ‌ణం, భాధ్ర‌ప‌దం, ఆశ్వీజం, కార్తీకం, మార్గ‌శిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణాలు వస్తాయి.ఉత్తర భారతదేశంలో చైత్ర నవరాత్రులు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి.

భారతదేశ జాతీయ క్యాలెండర్ ఖగోళ శాస్త్రం ఆధారంగా తయారు చేశారు.ఇది 1879 శక సంవత్సం (1957-58 AD) నుండి ఖగోళ శాస్త్ర కేంద్రం ద్వారా ప్రచురిత‌మ‌వుతోంది.

ఇందులో శక సంవ‌త్స‌రాన్ని ఉప‌యోగించారు. మహా గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరాచార్య సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు రోజులు, నెలలు, సంవత్సరాలను లెక్కించి ఈ రోజు నుండి పంచాంగాన్ని తయారు చేశారని చెబుతారు.

దేశంలో నూత‌న సంవ‌త్స‌రాన్ని జనవరి 1న కాకుండా ఉగాదిన జరుపుకోవాలని దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ప్ర‌జ‌ల‌కు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube