గ్లోబల్ వైడ్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan Tej ) ఇప్పుడు ఎవరికీ అందకుండా విభిన్నంగా ముందుకు వెళ్తున్నాడు.ఒకవైపు భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా సినిమాలు తీయడానికి సిద్ధం అయ్యాడు.
మరి ఇంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న చరణ్ కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కున్నాడు.ఈయన లుక్ నుండి సినిమాల వరకు అన్నింటిపై ఒకప్పుడు తెగ విమర్శలు చేసారు.
మరి చరణ్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అప్పుడే 16 సంవత్సరాలు పూర్తి అవుతుంది.ఈయన తొలిసారి చిరుత సినిమాతో( Chirutha ) సినీ ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమా 2007 సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించింది.పూరీ జగన్నాథ్ ను నమ్మి మెగాస్టార్ ఆయన చేతుల్లో తన కొడుకు మొదటి సినిమాను పెట్టారు.
పూరీ కూడా చరణ్ కు మంచి హిట్ ఇచ్చాడు.

ఈ సినిమా వచ్చి ఈ రోజుకు 16 ఏళ్ళు అవుతుంది.ఈ సినిమా తోనే హీరోగా మారాడు చరణ్.ఇక ఆ తర్వాత రాజమౌళి మగధీర సినిమాతో( Magadheera ) రామ్ చరణ్ భారీ క్రేజ్ పెంచుకుని తనపై వచ్చిన విమర్శలను కూడా పోగొట్టుకుని మెగాస్టార్ వారసుడిగా తనని తాను నిరూపించుకున్నాడు.
ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్నాడు.

చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును వరల్డ్ వైడ్ గా తెచ్చుకుని ఈ స్థాయికి చేరుకున్నాడు.ఆర్ఆర్ఆర్ తర్వాత భారీ లైనప్ సెట్ చేసుకుంటున్న చరణ్ వాటిని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
మరి ఈయన 16 ఏళ్ళు సక్సెస్ ఫుల్ కెరీర్ ను పూర్తి చేసుకోవడంతో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.







