పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ జోరు మీద ఉన్నాడు.ఈయన ఇమేజ్ కు తగ్గ కథలను ఎంచుకుంటూ దూసుకు పోతున్నాడు.
ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.ప్రెజెంట్ ప్రభాస్ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
వీటిలో ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూట్ పూర్తి అయ్యింది.ఇక సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు కూడా షూట్ జరుపు కుంటున్నాయి.
వీటితో పాటు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమా షూట్ ప్రెజెంట్ శరవేగంగా జరుగుతుంది.షూట్ గురించి మేకర్స్ ఎలాంటి అప్డేట్ చెప్పకపోయినా ఈ సినిమా షూట్ మాత్రం సైలెంట్ గా జరుగుతుంది అని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.ప్రభాస్ ఒక క్రేజీ రూమర్ నెట్టింట వైరల్ అవుతుంది.ప్రభాస్ ను చాలా కాలం తర్వాత వింటేజ్ లుక్ లో డార్లింగ్ ఫ్యాన్స్ చూడబోతున్నారట.
ఈయన ఫ్యాన్స్ కు వింటేజ్ ట్రీట్ డెఫినెట్ గా ఇవ్వబోతున్నాడు అని అది కూడా మారుతి సినిమాలో అని తెలుస్తుంది.
తాజాగా ఈ సినిమా సెట్స్ నుండి ఒక పిక్ వైరల్ అయ్యింది.
దీనిని చూస్తేనే తెలుస్తుంది.ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించ బోతున్నాడు అని.దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తమ హీరోను మళ్ళీ పాత లుక్ లో చూడబోతున్నాం అని సంతోషంగా ఉన్నారు.చూడాలి ప్రభాస్ లుక్స్ అండ్ ఎనర్జీ ఏ లెవల్ లో ఉంటుందో.
ఇక ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై జి విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ కూడా నటించ బోతున్నట్టు సమాచారం.







