ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోషల్ మీడియాలో తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.వాడుకభాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం.
తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు గారు తెలుగుభాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారు.అని కొనియాడారు.
వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత.విద్యలో అనేక సంస్కరణలు తీసుకురావడం తెలిసిందే.ఈ క్రమంలో ఇంగ్లీష్ మీడియం విద్య విధానం పాఠ్యపుస్తకాలలో ఉండే పాఠ్యాంశాలను మరో పక్క పేజీలో తెలుగులో కూడా ప్రచురించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.మాతృభాష తెలుగు కి పెద్దపీట వేస్తూనే మరోపక్క ప్రపంచంతో పోటీపడేలా.
విద్యా విధానంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు ఎంతగానో హైలెట్ అయ్యాయి.







