క్లోనింగ్ విధానంతోనే ఆరోగ్యకరమైన పండ్ల మొక్కల ఉత్పత్తి సాధ్యం..!

వ్యవసాయ రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో ఎన్నో కొత్త మార్పులు వస్తున్నాయి.ప్రస్తుతం ఉద్యానవన తోటలు సాగు చేసే రైతులంతా ఇప్పుడు నర్సరీల పైనే ఆధారపడుతున్నారు.

 Production Of Healthy Fruit Plants Is Possible Only Through Cloning , Healthy Fr-TeluguStop.com

ఎందుకంటే నర్సరీ నిర్వాహకులు( Nursery Managers ) ఎప్పుడు కూడా నూతన సాంకేతిక విధానంతో మొక్కలను అభివృద్ధి పరుస్తున్నారు.నర్సరీలో పెరిగిన మొక్కలే ఆరోగ్యకరంగా ఉంటూ ఉండడంతో రైతులు ఈ మొక్కలనే సాగు చేసేందుకు అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

ఎలాంటి తోటలను పండించిన ఆరోగ్యమైన, మంచి జాతి మొక్కలు అందుబాటులో ఉంటేనే అధిక దిగుబడి సాధించడానికి వీలు ఉంటుంది.పంట సాగు చేపట్టిన తొలి సంవత్సరంలో ఏదైనా తప్పు జరిగితే, తరువాతి కాలంలో ఆ తప్పును సరిదిద్దుకోవడం కుదరదు.

ఆ తప్పు వల్ల జరిగే నష్టాన్ని కచ్చితంగా ఎదుర్కోవలసిందే.

Telugu Agriculture, Healthy Fruit, Latest Telugu-Latest News - Telugu

పండ్ల తోటలలో( orchards ) తీవ్ర నష్టానికి ప్రధాన కారణాలు ఏమిటంటే.శ్రేష్టమైన విత్తనాలు లభించకపోవడం, ఉత్తమమైన మొక్కలు అందుబాటులో లేకపోవడం.ఈ విషయాలను పెట్టుకున్నా నర్సరీ నిర్వాహకులు రైతులకు కావలసిన రకాలను అభివృద్ధి చేసి అందిస్తున్నారు.

క్లోనింగ్ విధానం( Cloning procedure ) అంటే.కొమ్మల కత్తిరింపులు.

తల్లి మొక్కల నుండి లేత కొమ్మలు కత్తిరించి వాటిని కోకోపీట్ ( Cocopeat )నింపిన ట్రేలలో నింపుతారు.ఆ తరువాత వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడం కోసం హీట్ చాంబర్ లలో ఓ నలభై రోజులపాటు ఉంచి తర్వాత అక్కడ నుండి పది రోజులపాటు షెడ్ నెట్లలో ఉంచుతారు.

తర్వాత రెండు నెలల పాటు ఆరుబయట ఈ మొక్కల పెంపకం చేపడతారు.ఇప్పుడు ప్రధాన పొలంలో నాటుకోవడానికి ఆరోగ్యకరమైన మొక్కలు తయారు అయినట్టే.

మామిడి, కొబ్బరి, జామ, పామాయిల్ లాంటి మొక్కలను క్లోనింగ్ విధానాల ద్వారా, అంటూ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube