ఆ యాడ్ కోసం సమంత మాములుగా రచ్చ చేయలేదుగా..!

టాలీవుడ్ మోస్ట్ గ్లామర్ బ్యూటీ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లుగా దూసుకుపోతుంది.తన అందంతో యువతను కన్నార్పకుండా చేస్తుంది ఈ భామ పెళ్లి తర్వాత మరింత అందం తో అందరిని ముంచేస్తుంది.

 Samantha Akkineni Ad For Sleepwell Mattresses Samantha, Sleepwell, Tollywood, Ad-TeluguStop.com

మోడ్రన్ గా కనిపిస్తూ హాట్ లుక్ లతో ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది.

Telugu Samantha, Sleepwell, Tollywood-Movie

సమంత వెండి తెరపై కాకుండా బుల్లితెరలో కూడా తన వంతు పాత్ర లలో నటిస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లలో ఒకరిగా నిలిచింది.పొట్టి పొట్టి బట్టలతో హాలీవుడ్ నటీమణులు స్థాయిని చేరుకుంటుంది.అంతేకాకుండా తన సోషల్ మీడియాలో తను షేర్ చేసే ఫోటోలు అంతా ఇంతా కాదు.

బుల్లితెరలో కూడా కొన్ని యాడ్ లలో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.అటు సినిమాల్లోనే కాకుండా ఇటు బుల్లితెర ప్రకటనల్లో కూడా నటిస్తూ తెగ బిజీగా మారింది.

అంతేకాకుండా తన భర్త నాగచైతన్య తో పాటు కొన్ని ప్రకటనలను చేయగా నిజానికి వీరి కాంబినేషన్ లో వచ్చే ప్రతి ఒక్క యాడ్, కార్యక్రమాలు కనువిందు చేస్తాయి.

ఇటీవలే సమంత తమిళంలో ఓ యాడ్ లో చేయగా దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇందులో సమంత స్లీప్ వెల్ పరుపుల గురించి ప్రకటించగా అలా షూటింగ్, ఫోటో షూట్ లంటూ తిరిగి తిరిగి అలసిపోయి వచ్చి బెడ్ పై పడుకుంటే ఆ సంతోషమే వేరు అంటూ సమంత తెలిపింది.

మన ఇల్లు, మన బెడ్ వంటి ఈ రెండు స్థలాలు మనకు సంతోషాన్ని ఇస్తాయి.మనకు ఆనందాన్ని ఇచ్చే ఈ స్థలాలను జాగ్రత్తగా చూసుకోవాలని, అందుకే స్లీప్ వెల్ వాడుతున్నాను అంతేకాకుండా నీమ్ ఫ్రెష్ టెక్నాలజీతో జేమ్స్ మన దగ్గరికి రాకుండా కాపాడుతుందని తెలిపింది.

మొత్తానికి సమంత బుల్లితెరలో కూడా బిజీ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube