ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అరెస్ట్ చేయడంపై సిసోడియా సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
కాగా సిసోడియా తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.ఈ క్రమంలో మనీశ్ సిసోడియా అరెస్ట్ అక్రమం అని వ్యాఖ్యనించారు.
ఈ నేపథ్యంలో పిటిషన్ ను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లాలని సిసోడియాకు సూచించింది.ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీజేఐ స్పష్టం చేసింది.







