ఎన్ఆర్ఐల కోసం పంజాబ్ సర్కార్ కొత్త పాలసీ.. త్వరలోనే అందుబాటులోకి

Punjab Govt To Bring New Nri Policy Details, Punjab Government, Nri Policy, Punjab Nri Policy, Minister Kuldeep Singh Dhaliwal, Cm Bhagawant Mann, Nri Fast Track Courts, Punjab Nri Issues, Nri Milnis,

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం లక్షలాది మంది భారతీయులు వివిధ దేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడే కుటుంబంతో సహా స్థిరపడుతున్నారు.

 Punjab Govt To Bring New Nri Policy Details, Punjab Government, Nri Policy, Punj-TeluguStop.com

మనదేశంలో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలను కలిగివున్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి.స్వాతంత్య్రానికి పూర్వమే పంజాబీలు కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో స్థిరపడ్డారు.

ఇక గల్ఫ్‌ దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో పంజాబీ ప్రవాసులు వున్నట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.ఆయా దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సాయపడుతున్నారు.

అయితే ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉండటంతో స్వరాష్ట్రంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం ఎన్ఆర్ఐల కోసం కొత్త ఎన్ఆర్ఐ పాలసీని తీసుకురానుంది.

ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కుల్‌దీప్ సింగ్ ధాలివాల్ ఓ ప్రకటన చేశారు.ఫిబ్రవరి 28 నాటికి దీనిని సిద్ధం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Telugu Kuldeepsingh, Nri Fast Track, Nri Milnis, Nri Policy, Punjab, Punjab Nri-

సోమవారం రాష్ట్ర డీజీపీ గౌరవ్ యాదవ్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎం బాలమురుగన్, ఎన్ఆర్ఐ వ్యవహారాల ఏడీజీపీ ప్రవీణ్ కుమార్ సిన్హా, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి వరీందర్ కుమార్‌లతో కుల్‌దీప్ సింగ్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.జలంధర్, ఎస్ఏఎస్ నగర్, లూథియానా, మోగా, అమృత్‌సర్‌లలో ‘ఎన్ఆర్ఐ మిల్నిస్’ విజయవంతంగా జరిగాయని చెప్పారు.ఎన్ఆర్ఐ మిల్నీస్‌లో వచ్చిన 606 ఫిర్యాదులకు గాను 250 ఫిర్యాదులను క్రమబద్ధీకరించామని, మిగిలిన వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని కుల్‌దీప్ సింగ్ తెలిపారు.

ఎన్ఆర్ఐల నుంచి అందిన ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం రెవెన్యూ, పోలీస్ శాఖకు సంబంధించినవేనని మంత్రి పేర్కొన్నారు.

Telugu Kuldeepsingh, Nri Fast Track, Nri Milnis, Nri Policy, Punjab, Punjab Nri-

ఎన్ఆర్ఐల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ప్రక్రియ కూడా ప్రారంభించామని కుల్‌దీప్ సింగ్ తెలిపారు.అమృత్‌సర్, మోగా, లూథియానా, ఎస్‌బీఎస్ నగర్, పాటియాలలో కొత్త కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.ఎన్ఆర్ఐ పోలీస్ స్టేషన్‌లలో ప్రత్యేక పోస్టులను సృష్టించే ప్రతిపాదనను ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు పంపనున్నట్లు కుల్‌దీప్ సింగ్ తెలిపారు.ఎన్ఆర్ఐ పోలీస్ స్టేషన్‌లను రూ.30 లక్షలతో పునరుద్ధరిస్తామని డీజీపీ హామీ ఇచ్చారని.అలాగే తక్షణం 75 మంది పోలీసులను నియమిస్తానని చెప్పారని కుల్‌దీప్ సింగ్ పేర్కొన్నారు.మార్చి నాటికి మరో 75 మంది పోలీసులను ఈ పోలీస్ స్టేషన్‌లలో నియమిస్తామని డీజీపీ చెప్పినట్లు ఎన్ఆర్ఐ మంత్రి స్పష్టం చేశారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube